యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌(Prabhas), బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌(Kriti sanon) జంటగా నటించిన ఆదిపురుష్‌(adipurush) సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రామాయణం ఆధారంగా తీసిన ఈ పౌరాణిక సినిమాను చూసి జనం నెత్తి నోరు బాదుకున్నారు. భారీ అంచనాల మధ్య జూన్‌ 16వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. సినిమాలోని సంభాషణపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక వేషధారణలపై కూడా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్‌ అలీఖాన్‌(saif alikhan) పోషించిన రావణాసురుడి వేషధారణ ఏ మాత్రం బాగోలేదు.

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌(Prabhas), బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌(Kriti sanon) జంటగా నటించిన ఆదిపురుష్‌(adipurush) సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రామాయణం ఆధారంగా తీసిన ఈ పౌరాణిక సినిమాను చూసి జనం నెత్తి నోరు బాదుకున్నారు. భారీ అంచనాల మధ్య జూన్‌ 16వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. సినిమాలోని సంభాషణపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక వేషధారణలపై కూడా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్‌ అలీఖాన్‌(saif alikhan) పోషించిన రావణాసురుడి వేషధారణ ఏ మాత్రం బాగోలేదు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను దారుణంగా తిట్టిపోశారు. ఈ సినిమాకు ఓం రౌత్‌(Om Raut) దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ రచయిత మనోజ్‌ ముంతశిర్‌(Manoj Muthashir) మాటలు రాశారు. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఆదిపురుష్‌ సినిమాను 600 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఫ్యాన్స్‌ పూర్తిగా నిరాశ చెందారు. సినిమా విడుదలై దాదాపు నెల రోజులు దాటింది.
దాదాపుగా ఆ సినిమాను అందరూ మర్చిపోయారు. ఇప్పుడు దర్శకుడు ఓం రౌత్‌ మళ్లీ ఆ సినిమాను గుర్తు చేసి జనం నుంచి తిట్లు తిన్నారు. సోషల్‌ మీడియాలో ఆయన పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది. తనకు ఇష్టమైన ఆలయాలను సందర్శించానని ఓం రౌత్‌ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఓం రౌత్ ఇన్‌స్టాలో శ్రీ మంగేశి దేవాలయం, శ్రీ శాంతదుర్గ దేవాలయం దర్శనం చేసుకున్నానని, ఇక్కడికి వచ్చిన తరచుగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటానని రాసుకొచ్చారు. ఈ రెండు పవిత్ర స్థలాలు తనను తన మూలాలకు కనెక్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఈ దేవాలయాలను దర్శించుకుని దీవెనలు పొందాలని తాను ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటానని పోస్ట్‌ చేశారు ఓం రౌత్‌. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. కొంతమంది ఆరు వందల కోట్ల రూపాయలను ఆగం చేశావు కదా అని కామెంట్స్ చేయగా, మరికొందరేమో అన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మరొకరు రాస్తూ దయచేసి మీరు దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తీయవద్దని సలహా ఇస్తున్నారు.

Updated On 25 July 2023 3:17 AM GMT
Ehatv

Ehatv

Next Story