మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళాశంకర్(Bholashankar) బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మొదటి షో నుంచే ఫ్లాప్‌టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాకు ఊహించని రీతిలో నష్టాలు రాబోతున్నాయని పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సినిమా పరాజయం కావడానికి చాలా కారణాలున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళాశంకర్(Bholashankar) బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మొదటి షో నుంచే ఫ్లాప్‌టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాకు ఊహించని రీతిలో నష్టాలు రాబోతున్నాయని పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సినిమా పరాజయం కావడానికి చాలా కారణాలున్నాయి. చూసినవాళ్లు ఓ పాతికేళ్ల కిందటి సినిమాను చూసినట్టు ఉందని కామెంట్ చేశారు. సినిమా ఫ్లాప్‌కు చాలా కారణాలున్నా తాజాగా మరో విషయం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ఆడకపోవడానికి హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy suresh) కూడా ఓ కారణమని అంటున్నారు. మహానటి సినిమాతో కీర్తి సురేశ్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. సావిత్రి(Savitri) పాత్రలో కీర్తి సురేశ్ ఒదిగిపోయారు. మలయాళ నటి అయిన కీర్తి నేను శైలజ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. కానీ మహానటి సినిమానే ఆమెకు బోల్డంత గుర్తింపును తెచ్చింది. జాతీయ అవార్డును(National award) కూడా తెచ్చి పెట్టింది.
స్టార్ హీరోయిన్‌గా మారిన కీర్తి సురేశ్ తర్వాత పవన్ కల్యాణ్(Pawan kalyan), మహేశ్‌బాబు వంటి అగ్రహీరోల సరసన నటించింది. ప్రస్తుతం దక్షిణాది భాషల సినిమాలతో పాటు హిందీలో కూడా నటిస్తున్నారు. ఓవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు చెల్లిలి పాత్రల్లోనూ నటిస్తున్నారు . భోళాశంకర్‌లో చిరంజీవికి చెల్లెలుగా నటించారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటించడం కలిసిరాలేదు కాబోలు. అచ్చం ఇలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కూడా జరిగింది. జైలర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను కొల్లగొడుతున్న రజనీకాంత్(Rajinikanth) ఇంతకు ముందు నటించిన అన్నాత్తే(annathe) ఘోరంగా దెబ్బతింది. ఇందులో రజనీకాంత్ చెల్లెలుగా కీర్తి సురేశ్ నటించారు. అలా ఇద్దరు స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించిన కీర్తి సురేశ్ ఊహించని ఫ్లాప్‌లను నెత్తిన వేసుకున్నారు. కీర్తి సురేశ్ చెల్లెలి పాత్రలు వేస్తే ఆమెకు ఏమోగానీ ఆమెకు అన్నగా నటించే స్టార్ హీరోలకు మాత్రం రిస్క్ తప్పదు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.