పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) తన మేనల్లుడు సుప్రిం హీరో సాయి ధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej)తో కలిసి నటిస్తున్న సినిమా బ్రో(Bro Movie).. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలయ్యింది.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) తన మేనల్లుడు సుప్రిం హీరో సాయి ధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej)తో కలిసి నటిస్తున్న సినిమా బ్రో(Bro Movie).. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలయ్యింది. అంతా బాగానే ఉంది కానీ ఈ టీజర్‌ విషయంపై నెట్టింట్లో ట్రోల్స్‌ మొదలయ్యాయి. బ్రో టీజర్‌లో పూజా హెగ్డే గురించే ట్రోల్‌ అంతా! టీజర్‌ ప్రారంభంలో ఓ కమర్షియల్‌ యాడ్‌లో పూజా హెగ్డే కనిపిస్తారు. ఆమెను యాడ్‌ చేయడానికే టీజర్‌ను ఆలస్యంగా రిలీజ్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ టీజర్‌లో పెట్టడానికేనా మహేశ్‌బాబ్‌(Mahesh Babu) నటిస్తున్న గుంటూరు కారం(Gunturu Karam) నుంచి పూజా హెగ్డే(Pooja Hegde)ను తీసేశావ్‌ అంటూ త్రివిక్రమ్‌పై సెటైర్లు విసురుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీని గురించే చర్చ సాగుతోంది. పూజా హెగ్డే లేకుండా త్రివిక్రమ్‌ సినిమాలు చేయలేరని, ఎక్కడో చోట ఆమె ఉండాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు. త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌ కౌంటర్లు ఇస్తున్నారు. త్రవిక్రమ్‌కు పూజా హెగ్డే లక్కీ హీరోయిన్‌ అంటూ ఇక ట్రోలింగ్‌ ఆపేయండ బ్రో అంటూ వేడుకుంటున్నారు. బ్రో చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇందులో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినొదయ సిత్తం సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రంలో పవన్ మరోసారి దేవుడి పాత్రలో అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 28న అడియన్స్ ముందుకు రానుంది.

Updated On 1 July 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story