బుధవారం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి చంద్రయాన్‌-3(Chandrayaan-3) పైనే ఉండింది. జాబిల్లిని ముద్దాడిని అపురూపఘట్టాన్ని చూసి భారతీయులందరి హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. ప్రజలంతా ఆనందంతో పరవశులయ్యారు. చంద్రయాన్‌-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై(South Pole) దిగుతుంటే కోట్లాది మంది సంతోషంతో తిలకించారు.

బుధవారం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి చంద్రయాన్‌-3(Chandrayaan-3) పైనే ఉండింది. జాబిల్లిని ముద్దాడిని అపురూపఘట్టాన్ని చూసి భారతీయులందరి హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. ప్రజలంతా ఆనందంతో పరవశులయ్యారు. చంద్రయాన్‌-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై(South Pole) దిగుతుంటే కోట్లాది మంది సంతోషంతో తిలకించారు. ఇవాళ త్రివర్ణ పతకాన్ని గర్వంగా చంద్రమండలంపై ఎగరేశాం అనే ఆనందం వెనుక ఎంతో మంది శ్రమ ఉంది. ఉద్వేగం, కన్నీళ్లు కూడా ఉన్నాయి.

ఇదంతా ఒక సినిమాగా మన కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం అది అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిచిపోవడం ఖాయం. ఇంతకు ముందు చంద్రయాన్‌-2 వైఫల్యాలను గుర్తు చేసుకుంటూ మన ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన చంద్రయాన్‌-3లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చంద్రుడి మీదకు విక్రమ్‌ ల్యాండర్‌(Vikram Lander) దిగింది. చంద్రయాన్‌-2 నుంచి చంద్రయాన్‌-3 విజయం వరకు ఇస్రో శాస్త్రవేత్తలకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించి విజయం దిశగా దూసుకువెళ్లారు.

ఇదంతా ఓ సినిమాగా తీసి భారతీయకులకే కాదు, ప్రపంచానికి చూపించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఇందుకు ఎవరైనా నిర్మాతలు ముందుకు రావాలని అడుగుతున్నారు. నిర్మాత, దర్శకులు రెడీగా ఉన్నారనే అనుకుందాం! మరి సినిమాలో ప్రధాన భూమికను పోషించేది ఎవరు? అన్న ప్రశ్న తలెత్తితే మాత్రం ముందుగా గుర్తుకు వచ్చేది బాలీవుడ్‌ స్టార్‌ మీరో అక్షయ్‌ కుమారే(Akshay Kummar)! సోషల్‌ మీడియాలో ఆయన ఫ్యాన్స్‌ అందరూ ఇదే కోరుకుంటున్నారు.

చంద్రయాన్‌-3ని సినిమాగా(Movie) తీయమని డిమాండ్‌ చేస్తున్నారు. దేశంలో ఏదైనా సంచలన సంఘటన జరిగితే ఆ అంశంపై సినిమా తీయడానికి మనవాళ్లు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇలాంటి సినిమాలు తీయాలంటే మొదట వినిపించే పేరు అక్షయ్‌ కుమార్‌. ఇప్పటికే ఆయన మిషన్‌ మంగల్‌(Mission mangal), రామసేతు(Ramasethu), కేసరి(Kesari), ఓఎమ్‌జీ(OMG) వంటి విభిన్నమైన చిత్రాలతో అలరించారు.

దీంతో చంద్రయాన్‌-3 సినిమాగా తీస్తే అక్షయ్‌ కంటే బెటర్‌ ఆప్షన్‌ మరొకరు ఉండరని ఆయన ఫ్యాన్స్‌ అంటున్నారు. పైగా ప్రధాని మోదీతో అక్షయ్‌కుమార్‌కు మంచి అనుబంధమే ఉంది. అందులోనూ మోదీ ప్రధానిగా ఉన్న సమయంలోనే చంద్రయాన్‌-3 సక్సెస్‌ అయ్యింది కాబట్టి అక్షయ్‌ కుమార్‌ ఈ సబ్జెక్ట్‌ను వదలరు గాక వదలరు. పైగా నిర్మాణానికి డబ్బులు పెట్టడానికి బీజేపీ సానుభూతిపరులు సిద్ధంగా ఉన్నారు.

Updated On 24 Aug 2023 12:01 AM GMT
Ehatv

Ehatv

Next Story