స్మృతి వెంకట్‌(Smriti Venkat) తెలుసుకదా! తమిళంలో(Tamil) అగ్రశ్రేణి హీరోయిన్‌గా ఎదగాలని ఆరాటపడుతున్న నటీమణులలో ఈమె కూడా ఒకరు. కెరీర్‌ ఆరంభంలో కథానాయకులకు చెల్లెలి పాత్రలో నటించారు. ఇప్పుడిప్పుడే హీరోయన్‌గా నటించే స్థాయికి ఎదిగారు. కానీ అగ్రనటుల సరసన నటించే అవకాశం ఇంకా రాలేదు.

స్మృతి వెంకట్‌(Smruthi Venkat) తెలుసుకదా! తమిళంలో(Tamil) అగ్రశ్రేణి హీరోయిన్‌గా ఎదగాలని ఆరాటపడుతున్న నటీమణులలో ఈమె కూడా ఒకరు. కెరీర్‌ ఆరంభంలో కథానాయకులకు చెల్లెలి పాత్రలో నటించారు. ఇప్పుడిప్పుడే హీరోయన్‌గా నటించే స్థాయికి ఎదిగారు. కానీ అగ్రనటుల సరసన నటించే అవకాశం ఇంకా రాలేదు. ఆ ఛాన్స్‌ల కోసమే స్మృతి వెంకట్‌ ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తూ కూర్చుంటే ఆ ఛాన్సులు ఎప్పటికీ రావని తెలుసుకున్న ఆమె అందాల ఆరబోతను మొదలు పెట్టారు.

ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా లిప్‌లాక్‌ సన్నివేశాలకు కూడా సిద్ధమయ్యారు. అది కూడా సినిమా షూటింగ్‌కు ముందే ఆ చిత్ర హీరోతో ఘాటు ముద్దుకు రెడీ అయిపోయారు. దీంతో మూవీ లోకేషన్‌లోని వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకు ముందు దేజావు(Dejavu) సినిమాలో మంచి విజయాన్ని సాధించిన యువ దర్శకుడు అరవింద్‌ శ్రీనివాసన్‌(Arvind Srinivas) లేటెస్ట్‌గా తెరకెక్కిస్తున్న సినిమా తరుణం. ఈ సినిమాలో కిషన్‌దాస్‌(kishen Das) హీరోగా, స్మృతి వెంకట్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఈ మధ్యనే మొదలయ్యింది.

షూటింగ్‌కు ముందే ఒక టీజర్‌కు చిత్రీకరించి విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అందులో స్మృతి వెంకట్‌, కిషన్‌దాస్‌తో లిప్‌లాక్(lipkiss) సన్నివేశంతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు కూడా స్మృతి వెంకట్‌పై బోల్డన్నీ సైటెర్లు విసురుతున్నారు. టీజర్‌లోనే ఇంత ఘాటైన చుంబనాల సన్నివేశం ఉంటే సినిమాలో ఎలా ఉంటుందోనని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా టీజర్‌తోనే దర్శకుడు తరుణం సినిమా మీద అంచనాలు పెంచేశారు. దాంతో పాటు స్మృతి వెంకట్‌ కూడా అందరి దృష్టిని తనమీదకు మళ్లించుకున్నారు.

Updated On 19 Jun 2023 1:11 AM GMT
Ehatv

Ehatv

Next Story