సినిమా విడుదలకు ముందే లాభాలు వస్తే ఆ నిర్మాతలకు అంతకంటే కావాల్సింది ఏమంటుంది? విశ్వనాయకుడు కమలహాసన్‌(Kamal Hassan) హీరోగా వస్తున్న సినిమా ఇండియన్‌-2(Indian-2). రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన ఇండియన్‌ సినిమాకు ఇది సీక్వెల్‌.

సినిమా విడుదలకు ముందే లాభాలు వస్తే ఆ నిర్మాతలకు అంతకంటే కావాల్సింది ఏమంటుంది? విశ్వనాయకుడు కమలహాసన్‌(Kamal Hassan) హీరోగా వస్తున్న సినిమా ఇండియన్‌-2(Indian-2). రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన ఇండియన్‌ సినిమాకు ఇది సీక్వెల్‌. ఇండియన్‌ మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహించారు. ఇండియన్‌-2 సినిమాకు కూడా శంకరే దర్శకత్వం(Shankar) వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌(Laika Production) సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

నాలుగైదు ఏళ్ల కిందట సినిమా మొదలయ్యింది కానీ ఇప్పటికీ షూటింగ్‌ పూర్తి చేసుకోలేకపోయింది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ఎన్నో అవరోధాలను అధిగమించింది. ఇప్పటికీ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌(Kajal Aggarwal), రకుల్‌ ప్రీత్‌సింగ్‌(Rakhul Preeth singh), ప్రియ భవానీ శంకర్‌(Priya Bhavani Shanakar), సముద్రఖని(Samithrakhani), బాబీ సింహ(Bobi Simha) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అనిరుధ్‌(anirudh) సంగీతం అందిస్తున్నారు. నిర్మాణంలో లేట్‌ అయినప్పటికీ సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. వ్యాపారంలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. చిత్ర బడ్జెట్‌ 200 కోట్ల రూపాయలని సమాచారం. అయితే చిత్ర ఆడియో హక్కులను ఇంతకు ముందే సరిగమ(Sarigama) సంస్థ 23 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకుంది.

ఇప్పుడు డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌(Netflix) సంస్థ 220 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుందని అంటున్నారు. ఇప్పటికే ఇండియన్‌– 2 చిత్రం నిర్మాతలకు టేబుల్‌ ప్రాఫిట్‌ తెచ్చిపెట్టిందని అనుకోవచ్చు. ఇకపోతే చివరి దశలో ఉన్న ఈ సినిమాను శంకర్‌ రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకుంటున్నారట.

ఇందుకోసం కమలహాసన్‌ మరో 25 రోజులు అదనంగా కాల్‌షీట్స్‌ కేటాయించాల్సి ఉంటుందని శంకర్‌ సూచించారట! ప్రస్తుతం ప్రభాస్‌(Prabhas) హీరోగా వస్తున్న కల్కిలో(Kalki) కమలహాసన్‌ నటిస్తున్నారు. ఆ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసిన తర్వాత ఇండియన్‌– 3 చిత్రంపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు .

Updated On 25 July 2023 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story