ఓటీటీ ప్లాట్‌ఫామ్(OTT Platform) నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) వచ్చే డ్యాకుమెంటరీలు(Documentries) సినిమాల కంటే గ్రాండ్‌గా, రిచ్‌గా ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచే వచ్చిన బ్యాడ్ బాయ్ బిలియనీయర్స్, హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్, కర్రీ అండ్ సైనైడ్ , ది హంట్ ఫర్ వీరప్పన్ లాంటి ఇండియన్ క్రైమ్ డ్యాకుమెంటరీలకు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
ఓటీటీ ప్లాట్‌ఫామ్(OTT Platform) నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) వచ్చే డ్యాకుమెంటరీలు(Documentries) సినిమాల కంటే గ్రాండ్‌గా, రిచ్‌గా ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచే వచ్చిన బ్యాడ్ బాయ్ బిలియనీయర్స్, హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్, కర్రీ అండ్ సైనైడ్ , ది హంట్ ఫర్ వీరప్పన్ లాంటి ఇండియన్ క్రైమ్ డ్యాకుమెంటరీలకు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మరో డ్యాకుమెంటరీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. 2015లో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై(Sheena Bora murder case) ఈ డ్యాకుమెంటరీని తీస్తున్నారు. ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్ (The Indrani Mukerjea Story Buried Truth) అనే పేరుతో డ్యాకుమెంటరీని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను(First) విడుదల చేశారు మేకర్స్. దాంతో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. 2015లో షీనాబోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నతల్లే కూతుర్ని చంపేసిందన్న నిజం ఆశ్చర్యాన్ని కలిగించింది. 2012, ఏప్రిల్ మాసంలో 24 ఏళ్ల షీనా బోరాను తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె అప్పటి డ్రైవర్ శ్యాంవర్ రాయ్, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాలతో కలిసి కారులో గొంతుకోసి చంపారు. ఆ తర్వాత రాయ్‌గఢ్ జిల్లాలోని అడవిలో షీనా బోరా మృతదేహాన్ని కాల్చివేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్లు జైలులో ఉన్నారు. 2022, మే మాసంలో జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ డ్యాకుమెంటరీ ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.