ప్రభాస్‌(Prabhas) రాముడిగా, కృతి సనన్‌(kriti sanon) సీతగా నటించిన ఆదిపురుష్‌(adipurush) సినిమా శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా రిలీజయ్యింది. థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. రామాయణం(ramayanam) ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు ఓం రౌత్‌(om raut) దర్శకత్వం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా నేపాల్‌లో మాత్రం విడుదల కాలేదు.

ప్రభాస్‌(Prabhas) రాముడిగా, కృతి సనన్‌(kriti sanon) సీతగా నటించిన ఆదిపురుష్‌(adipurush) సినిమా శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా రిలీజయ్యింది. థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. రామాయణం(ramayanam) ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు ఓం రౌత్‌(om raut) దర్శకత్వం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా నేపాల్‌లో మాత్రం విడుదల కాలేదు. అందుకు కారణం ఈ సినిమాలో సీతాదేవి భారతదేశపు కుమార్తె అనే డైలాగ్‌ చెబుతూ ఓ సన్నివేశం ఉండటమే! దీనిని నేపాల్ సెన్సార్‌ బోర్డు తప్పుపట్టింది. సీతాదేవి(seetha) నేపాల్‌లో(Nepal) జన్మించిందని అక్కడి వారు బలంగా నమ్ముతారు. సీతమ్మకు అక్కడ పెద్ద ఆలయం కూడా ఉంది. సీతారాముల కళ్యాణం అక్కడ గొప్పగా జరుగుతుంది. ఈ ఒక్క డైలాగు కారణంగా అక్కడ సినిమా రిలీజ్‌ కలేదు. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్‌ సినిమాను బ్యాన్‌ కూడా చేశారు. ఆ డైలాగును తొలగించాల్సిందిగా మూవీ మేకర్స్‌ను నేపాల్‌ వారు కోరారు. దాంతో వివాదానికి కారణమైన ఆ సంభాషణను చిత్రంలోంచి తొలగించారు. తర్వాత నేపాల్‌ల సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కాకపోతే మార్నింగ్‌ షోలు మాత్రం ఆగిపోయాయి.

Updated On 16 Jun 2023 3:41 AM GMT
Ehatv

Ehatv

Next Story