తెలుగువారు గర్వించదగ్గ నటులలోబ్రహ్యానందం(Brahmanandam) ఒకరు. దాదాపు 1500 లకు పైగా సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించి..గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Guinness World Records)కుఎక్కిన నటుడు బ్రహ్మానందం... నటుడిగా ఎంతో ఎత్తులకు ఎదిగారు. రెండు తరాల నటులతో ఆయన సినిమా జర్నీ కొనసాగించారు. బోర్ కొట్టకుండా.. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు తనను తాను మార్చుకుని..

తెలుగువారు గర్వించదగ్గ నటులలోబ్రహ్యానందం(Brahmanandam) ఒకరు. దాదాపు 1500 లకు పైగా సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించి..గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Guinness World Records)కుఎక్కిన నటుడు బ్రహ్మానందం... నటుడిగా ఎంతో ఎత్తులకు ఎదిగారు. రెండు తరాల నటులతో ఆయన సినిమా జర్నీ కొనసాగించారు. బోర్ కొట్టకుండా.. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు తనను తాను మార్చుకుని.. కమెడియన్ గా తన పేరు చిరస్థాయిగా నలబడేట్టు చేసుకున్నాడు బ్రహ్మీ.

మరీ ముఖ్యంగా హాస్యనటుడిగా ఉన్నత శిఖరాలను తాకిన బ్రహ్మనందానికి తెలుగు భాషపై .. తెలుగు సాహిత్యంపై మంచి పట్టుంది. తెలుగు లెక్చరర్ గా పనిచేసిన ఆయన, ఆ తరువాతనే నటన వైపు అడుగులు వేసి.. ఆదిశగా సక్సెస్ ను అందిపుచ్చుకున్నారు, హాస్య నటుడిగా ఒక వెలుగు వెలిగారు. కొన్నేళ్ల పాటు బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండేది కాదు. హాస్య నటులలో ఆయన పోషించినన్ని పాత్రలను మరొకరు పోషించలేదనే చెప్పాలి.

ఇక బ్రహ్మానందతో ఎంతో మంది నటులకు, ఎంతో మంది దర్శకులకు జీవితాన్ని ఇచ్చారు. ఆయన వల్ల సూపర్ హిట్ అయిన సినిమాలెన్నో.. ఎంతోమంది హీరోలతో కలిసి నటించారు. ఇక ఆయన ప్రధానమైన పాత్రగా రూపొందిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించేశారు. వయసు పై పడటం, హార్ట్ ఆపరేషన్ జరగడంతో.. మునిపటిలా సినిమాలు చేయలేకపోతున్నారుబ్రహ్మీ. అందుకే తను చేయాల్సిన సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు.

బాగా అర్జెంట్ అయి.. తప్పక చేయాలి అనుకున్నసినిమాను మాత్రమే చేస్తున్నారు బ్రహ్మానందం. అంతే కాదు మిగతా టైమ్ అంతా. తాను కొత్తగాకట్టుకున్న ఇంట్లో.. హ్యాపీగా మనవళ్లతో గడుపుతూ.. తనకి ఇష్టమైన పెయింటింగ్స్ ను వేస్తూనే, తన ఆత్మకథను రాసుకున్నారు. తాజాగా ఆ ఆత్మకథను కూడా పూర్తిచేశారు బ్రహ్మానందం.

తన ఆత్మకథకు ఆయన 'నేను .. మీ బ్రహ్మానందం' అనే టైటిల్ పెట్టారు. తన జీవితం ... అనుభవాలు .. అనుభూతులు .. జ్ఞాపకాలను ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారట. వచ్చేనెలలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. ఆయన కొనసాగించిన జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Updated On 22 Nov 2023 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story