సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన జైలర్ సినిమా(Jailer Movie) ఘన విజయం దిశగా దూసుకుపోతున్నది. దాంతో అందరి దృష్టి ఆ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar)పై పడింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను కుమ్మేస్తుండటంతో నెల్సన్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు.

Nelson Dilipkumar
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన జైలర్ సినిమా(Jailer Movie) ఘన విజయం దిశగా దూసుకుపోతున్నది. దాంతో అందరి దృష్టి ఆ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar)పై పడింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను కుమ్మేస్తుండటంతో నెల్సన్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు. గతంలో తాను దర్శకత్వం వహించిన బీస్ట్ సినిమా విడుదలైన తర్వాత లోకనాయకుడు కమలహాసన్(Kamal Haasan)ను కలిశానని, ఓ సినిమా చేసే ప్రయత్నం జరిగిందని అన్నారు. కథ రెడీ అయితే తమ కాంబినేషన్‌లో తప్పకుండా సినిమా ఉంటుందని నెల్సన్ తెలిపారు. జైలర్ విడుదలయ్యాక కమలహాసన్ ఫోన్ చేసి, అభినందించారని పేర్కొన్నారు. తాను టెలివిజన్‌కు పనిచేస్తున్న సమయం నుంచే కమలహాసన్ తెలుసని చెప్పారు. విజయ్ హీరోగా రూపొందిన సినిమా బీస్ట్(Beast Movie). ఇది నెల్సన్‌కు మూడో సినిమా. దీని తర్వాతే రజనీకాంత్ హీరోగా జైలర్‌ను తీశారు. యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్‌లాల్(Mohanlal), కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్‌తోపాటు రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 10వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ఇంచుమించు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసిందని సన్ పిక్చర్స్ ప్రకటించింది. వారంలో ఇంత మొత్తంలో కలెక్షన్స్ చేసిన మొదటి తమిళ సినిమా ఇదేనని తెలిపింది. ప్రస్తుతం నెల్సన్ జైలర్‌కు సీక్వెల్‌ను రెడీ చేసుకుంటున్నారట! ఆ సీక్వెల్‌లో విజయ్‌తో కీలక పాత్ర చేయించాలని ఆయన అనుకుంటున్నారట! నెల్సన్ దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన కొలమావు కోకిల, డాక్టర్ సినిమాలు కూడా తెలుగులో విడుదలై మంచి విజయం అందుకున్నాయి.
