నేల టిక్కెట్లు(Nela ticket) సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు మాళవికా శర్మ(Malavika Sharma). ముంబాయికి చెందిన ఈ అందాల తార తెలుగువారికి దగ్గరయ్యారు. ఇటీవల ఆమె తన మంచి మనసును చాటుకున్నారు. పేద విద్యార్థులకు చెప్పులు దానం చేశారు. వాటిని ఆమెనే స్వయంగా చిన్నారుల పాదాలకు తొడిగారు. వారి మోముల్లో ఆనందం చూసి తనూ ఆనందపడ్డారు.
నేల టిక్కెట్లు(Nela ticket) సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు మాళవికా శర్మ(Malavika Sharma). ముంబాయికి చెందిన ఈ అందాల తార తెలుగువారికి దగ్గరయ్యారు. ఇటీవల ఆమె తన మంచి మనసును చాటుకున్నారు. పేద విద్యార్థులకు చెప్పులు దానం చేశారు. వాటిని ఆమెనే స్వయంగా చిన్నారుల పాదాలకు తొడిగారు. వారి మోముల్లో ఆనందం చూసి తనూ ఆనందపడ్డారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్(Instagram Post) చేశారు. రాజస్థాన్‌లోని దేవ్‌గఢ్‌లో ఉన్న దాదాపు 40 పాఠశాలలకు దేవ్ శ్రీ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అందిస్తోంది. ఆ ట్రస్ట్ సపోర్ట్ చేస్తోన్న పలు పాఠశాలలను ఇటీవల మాళవికా శర్మ సందర్శించారు. విద్యార్థులకు అవసరమైన సాయం చేశారు. తను షేర్ చేసిన వీడియోలో ఆమె విద్యార్థులకు చెప్పులు తొడుగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె గొప్ప మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఏప్రిల్ నెలలోనే మాళవిక పాఠశాలలను సందర్శించి సాయం చేసినప్పటికీ తాజాగా ఆమె ఈ వీడియోను షేర్ చేశారు. ఇక, సినిమాల విషయానికి వస్తే 2021లో విడుదలైన రెడ్ తర్వాత ఆమె తెలుగులో ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చేయలేదు.