మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాత్ర-2 చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

యాత్ర-2 సినిమా ఈ వారం విడుదల అవుతూ ఉంది. యాత్ర సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు సీక్వెల్ కు టైమ్ వచ్చింది. అయితే ఈ సినిమా మీద కొందరు కావాలనే నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. యాత్ర-2 లో కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ మాత్రమే ఉందని.. అవి థియేటర్ కు వెళ్ళీ చూడాల్సిన అవసరం లేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

అయితే దర్శకుడు మహి వి.రాఘవ్ మాత్రం ఈ వార్తలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. యాత్ర-2 సినిమాను చూడలేదు.. అప్పుడే మాట్లాడితే ఎలా? నేనొక వెర్షన్ అనుకున్నాను.. దాన్నే చూపిస్తున్నానని తెలిపారు. కథను కథగానే చూడాలి. మనం డప్పు కొట్టుకున్నామా అనే విషయం ఆడియన్స్ తేలుస్తారు. ఇందులో ఎవరినీ టార్గెట్ చేయలేదు. ఆయన జీవితంలో కొన్ని పరిణామాలు జరిగాయి. కొందరిని ఎదిరించాడు, పార్టీలోంచి బయటికి వచ్చాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు. సినిమాలో వీటినే చూపించాం. అంతేతప్ప విలన్, హీరో అంటూ ఏమీ ఉండదన్నారు. పరిస్థితుల ఆధారంగా సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని సినిమాని చాలా ఎమోషన్గా తీశాను. ట్రైలర్‌లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే..ఆ సీన్‌తో ఎమోషన్‌ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నదే సినిమా ప్రధాన ఉద్దేశమని అన్నారు.

వైఎస్సార్, జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర-2. గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, తమిళ హీరో జీవా ప్రధాన పాత్రలు పోషించారు. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాత్ర-2 చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Updated On 6 Feb 2024 9:35 PM GMT
Yagnik

Yagnik

Next Story