ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు, కానీ దేవుడు, దేవర అనే టైటిల్స్ మాత్రం పరిశీలనలో ఉన్నమాట అయితే వాస్తవమే. ఇంకా కూడా మరికొన్ని టైటిల్స్‌ ప్రస్తావనకొస్తున్నాయి. అయితే ఇంత తొందరగా టైటిల్‌ ప్రకటించాల్సిన అవసరం లేదని కూడా ఓ చర్చ వాడివేడిగా జరుగుతూనే ఉంది. కాకపోతే పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ ఈ టైటిల్‌ గురించి ఆత్రంగా ఎదురుచూస్తున్న మాట కూడా పచ్చినిజం. కానీ టైటిల్‌ లేకపోయినంత మాత్రాన ఫేన్స్ ఒప్పుకుంటారా అని ఏన్స్‌ని పైన కొందంత అభిమానం కుమ్మరిస్తూ రాస్తున్న మాటలు కేవలం ఫేన్స్‌ని రెచ్చగొట్టి అల్లరి చేయడానికేనా అన్నట్టున్నాయని ఇండస్ట్రీలో కొందరు పెద్దలు కామెంట్‌ చేస్తున్నారు.

ఓ స్టార్‌ గురించి గానీ, ఓ హీరో గురించి గానీ రాసేటప్పుడు ఆ స్టార్ వేల్యూ ఏమిటి, ఆ స్టార్‌డమ్‌లో రగిలే ఫైర్‌ ఏమిటి, ఎంత అనే కొలతులు, షరతులు తెలుసుకుని రాసే వివేకం, విచక్షణ సోషల్‌ మీడియాలోని కొన్ని పిచ్చిరాతలలో లోపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ గురించి రాసేటప్పుడు ఆయనెంతటి వైల్డ్ ఫైరో, ఆ ఫైర్‌లో ఉన్న హీట్‌ ఎంతో తెలియకపోతే ఆయన గురించి రాయకపోతేనే బెటర్‌. ఈ మధ్య ఓ వెబ్‌సైట్‌లో పవర్ స్టార్‌ తెలుగులో చేస్తున్న సినిమా వినోదయ సితం (vinodhaya sitham) గురించి రాస్తూ టైటిల్‌ లేకపోతే పవన్‌ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని పవన్‌ని ఏదో మెచ్చుకుంటూ మేకతోలు కప్పుతున్న ఎప్‌క్ట్ తీసుకురావడానికి ప్రయత్నించి తప్పులో కాలేశారు.

ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు, కానీ దేవుడు, దేవర అనే టైటిల్స్ మాత్రం పరిశీలనలో ఉన్నమాట అయితే వాస్తవమే. ఇంకా కూడా మరికొన్ని టైటిల్స్‌ ప్రస్తావనకొస్తున్నాయి. అయితే ఇంత తొందరగా టైటిల్‌ ప్రకటించాల్సిన అవసరం లేదని కూడా ఓ చర్చ వాడివేడిగా జరుగుతూనే ఉంది. కాకపోతే పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ ఈ టైటిల్‌ గురించి ఆత్రంగా ఎదురుచూస్తున్న మాట కూడా పచ్చినిజం. కానీ టైటిల్‌ లేకపోయినంత మాత్రాన ఫేన్స్ ఒప్పుకుంటారా అని ఏన్స్‌ని పైన కొందంత అభిమానం కుమ్మరిస్తూ రాస్తున్న మాటలు కేవలం ఫేన్స్‌ని రెచ్చగొట్టి అల్లరి చేయడానికేనా అన్నట్టున్నాయని ఇండస్ట్రీలో కొందరు పెద్దలు కామెంట్‌ చేస్తున్నారు.

పైగా పవర్‌స్టార్‌ రేంజ్‌ని మరచిపోయి, గతంలో కూడా ఇలా పేరులేని సినిమా ఒకటొచ్చిందని, ఓ అనామక సినిమాని ఉదహరించి రాయడం పవన్‌ కళ్యాణ్‌ స్థాయిని అగౌరవపరిచినట్టే అక్షరాల. కొండను, గుట్టనూ ఒకే త్రాటికి రాయడం జర్నలిజం అనిపించుకోదు. అసలు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) సినిమాకి టైటిల్‌ అవసరమా? పోస్టర్‌ అవసరమా? ఒక్క డేట్‌ చెబితే చాలదా? దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? పవన్‌ కళ్యాణ్‌ సినిమా రిలీజ్‌ అయితే చాలని ఆయన ఫేన్స్ మాత్రమే కాదు, సగటు ప్రేక్షకుడు ప్రతీ ఒక్కరూ వెయిట్‌ చేస్తునే ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే పవన్‌ కళ్యాణ్‌ తన రాజకీయ వ్యవహరాలు బాగా వేడెక్కుతున్నా సరే, దర్శకనిర్మాతలకు సహకరించి సినిమాలు చేస్తూ, ఇటు పరిశ్రమనీ, అటు ప్రేక్షకలోకాన్ని రెండిటినీ సంతృప్తి పరచడానికే రాత్రీ పగలూ పనిచేస్తున్నారన్నది తిరుగులేని యదార్ధం. ఈ నేపథ్యంలో కందకి లేని దురద కత్తిపీటకెందుకు అన్న విమర్శలు కూడా వస్తున్నాయన్న విషయాన్ని సదరు రాతగాళ్ళు తెలుసుకోవాలి.

అదే సినిమా అయినా కావచ్చు, అదే టైటిల్‌ అయినా కావచ్చు, కావాల్సింది తెరమీద పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) కనిపించడం, నటించడం అంతే. ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పవన్‌ పాప్యులారిటీ కొత్త పుంతలు తొక్కి వెల్లువలా పెల్లుబుకుతోంది. Think twice before you ink అన్నట్టు larger than life image ఉన్నవాళ్ళ గురించి రాసేటప్పడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని రాయాలి. అదీ నిజమైన జర్నలిజం.
లేనిపోని రాతలతో కాలం వెళ్ళబుచ్చుకోవడం జర్నలిజం అనిపించుకోదు.

ఇక్కడో మాట గుర్తు చేయాలి. గబ్బర్‌ సింగ్‌ సినిమాలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఓ డైలాగ్‌ రాసాడు పవన్‌ కళ్యాణ్‌ గురించి, బ్రహ్మానందం చెప్పిన డైలాగ్‌ అది. కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలని. అదీ పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌. ఇమేజ్‌ ఉన్నోడికి టైటిల్‌ కూడా అక్కర్లేదు. విడుదలైన తర్వాత ఫేన్స్ మక్కువతో ఏదైనా పేరు సూచిస్తే అది వేరు మళ్ళీ. అదో ముచ్చట. అదో వేడుక. వేడుకని వివాదం చేయడంలో ఔచిత్యం లేదని గ్రహించాలి. " Written By Nagendra Kumar "

Updated On 22 April 2023 7:43 AM GMT
Ehatv

Ehatv

Next Story