నీనా గుప్తా(Neena Gupta), కాజోల్(Kajol), మృణాల్ ఠాకూర్(Mrunal Takkur), తమన్నా(tamannaah), విజయ్ వర్మ(vijay Varma) ప్రధాన పాత్రలలో నటించిన లస్ట్ స్టోరీస్-2(Lust Stories) వెబ్ సిరీస్(web series) త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ కానుంది. కొన్నాళ్లుగా వయసుకు తగిన పాత్రలు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్న నీనా గుప్తా లస్ట్ స్టోరీస్-2లో మళ్లీ టెలివిజన్ స్క్రీన్‌లలోకి వచ్చారు.

Nina Guptha Comments On Sex
నీనా గుప్తా(Neena Gupta), కాజోల్(Kajol), మృణాల్ ఠాకూర్(Mrunal Takkur), తమన్నా(tamannaah), విజయ్ వర్మ(vijay Varma) ప్రధాన పాత్రలలో నటించిన లస్ట్ స్టోరీస్-2(Lust Stories) వెబ్ సిరీస్(web series) త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ కానుంది. కొన్నాళ్లుగా వయసుకు తగిన పాత్రలు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్న నీనా గుప్తా లస్ట్ స్టోరీస్-2లో మళ్లీ టెలివిజన్ స్క్రీన్‌లలోకి వచ్చారు. ఈ సీరిస్‌లో శృంగార సన్నివేశాలతో పాటు బోల్డ్ సంభాషణలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
ఇంటిల్లిపాది చూసేట్టుగా లేదని కొందరు అంటున్నారు. ఇదే విషయాన్ని ఇందులో డాడీ మా రోల్‌లో నటించిన నీనా గుప్తాను అడిగితే ఆమె చాలా స్ట్రాంగ్‌గా బదులిచ్చారు. దాంతో పాటు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సెక్స్(sex) గురించి యువత తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నీనా అంటున్నారు. కాలేజీకి వెళ్లే రోజుల్లో అమ్మాయిలు ముద్దులు పెట్టుకోవడం ద్వారా గర్భం దాలుస్తారని అనుకునేదానినని అన్నారు. తన అమ్మ ఎంతో స్ట్రిక్ట్ అని చెబుతూ తన గతానికి సంబంధించిన కొన్ని అనుభవాలను పంచుకున్నారు నీనా గుప్తా.
'నాకు పన్నెండు , పదమూడేళ్లు వచ్చే వరకు కూడా నా తల్లితండ్రులు ప్రత్యేకంగా బెడ్‌రూమ్‌లో పడుకోలేదు. మేమంతా ఒకే గదిలో పడుకునేవాళ్లం. నేను, నా సోదరుడు మంచం పక్కన కింద పడుకునేవాళ్లం. కొన్నిసార్లు నేను నా తల్లిదండ్రుల మధ్య పడుకునేదాన్ని. అప్పటికి మకు శృంగారం గురించి ఏమీ తెలియదు. మా అమ్మ నాకు శృంగారం అంటే ఏమిటో చెప్పలేదు. పీరియడ్స్(periods) అంటే ఏమిటో కూడా చెప్పలేదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. నా ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు కూడా పంపించేది కాదు.
నాకిప్పటికీ గుర్తుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకోవడం ద్వారా గర్భవతి అవుతారని అనుకునేదాన్ని. అప్పట్లో ఇలాంటి విషయాలు తల్లులు తమ కూతుళ్లకు చెప్పడానికి భయపడేవారు. పూర్వకాలంలో పెళ్లికి ముందు శృంగారంపై అమ్మాయిలకు కొంత సమాచారం ఇచ్చేవారు. ఎందుకంటే పెళ్లయ్యాక ఫస్ట్‌నైట్(First night) ఏం జరుగుతుందో చెప్పేవారు. ఆ సమయంలో అబ్బాయితో ఎలా ఉండాలో వివరించేవారు.
ఇలా ఎందుకు చేసేవారంటే సెక్స్ విషయంలో కొత్త జంట మధ్య గొడవలు రాకూడదని, సెక్స్ కోసం భర్త అడిగినప్పుడు అమ్మాయి ఎలా ప్రవర్తించాలో తల్లులు చెప్పేవారు' అని నీనా గుప్తా అన్నారు. ఇది ఇవాళ్టికి కొన్ని చోట్ల జరుగుతున్న విషయమేనని, పరిస్థితులు ఏమీ మారలేదని నీనా అన్నారు. అందుకే ఇలాంటి విషయాలకు లస్ట్ స్టోరీస్-2 చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ సిరీస్‌లో శృంగార సన్నివేశాలుంటే తప్పేముందని, మనిషి జీవితంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్నే ఒక సినిమా ద్వారా చెబుతున్నామని నీనా గుప్తా వివరించారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా ఎంతోగానో ఉపకరిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు నీనా.
