ఈ తరం వారు దాంపత్య జీవితాన్ని పది కాలాలపాటు నిలుపుకోలేకపోతున్నారు. చిన్నచిన్న విషయాలకే తగాదాలు పడి విడాకులు(Divorce) ఇచ్చేసుకుంటున్నారు. పట్టుమని పది నెలలు కూడా కాపురం చేయని జంటలెన్నో ఉన్నాయి. అందుకే కొంతమంది యువతీయువకులు పెళ్లంటే(Marriage) విముఖత చూపిస్తున్నారు. పెళ్లి చేసుకోవడమెందుకు? విడాకులు ఇచ్చుకోవడం ఎందుకు? ఎంచక్కగా సహజీవనం(Live-in) చేస్తే సరి అని అనుకుంటున్నారు. బాలీవుడ్ నటి నీనా గుప్తా (neena gupta)ఈ రెండు రకాల పరిస్థులను ఎదుర్కొన్నారు. ఎనిమిదో దశకంలో నీనా గుప్తా ఓ సంచనలం. టెలివిజన్ (television) రంగాన్నే కాదు, హిందీ సినిమాలోనూ ఆమె హవా నడిచింది.
ఈ తరం వారు దాంపత్య జీవితాన్ని పది కాలాలపాటు నిలుపుకోలేకపోతున్నారు. చిన్నచిన్న విషయాలకే తగాదాలు పడి విడాకులు(Divorce) ఇచ్చేసుకుంటున్నారు. పట్టుమని పది నెలలు కూడా కాపురం చేయని జంటలెన్నో ఉన్నాయి. అందుకే కొంతమంది యువతీయువకులు పెళ్లంటే(Marriage) విముఖత చూపిస్తున్నారు. పెళ్లి చేసుకోవడమెందుకు? విడాకులు ఇచ్చుకోవడం ఎందుకు? ఎంచక్కగా సహజీవనం(Live-in) చేస్తే సరి అని అనుకుంటున్నారు. బాలీవుడ్ నటి నీనా గుప్తా (neena gupta)ఈ రెండు రకాల పరిస్థులను ఎదుర్కొన్నారు. ఎనిమిదో దశకంలో నీనా గుప్తా ఓ సంచనలం. టెలివిజన్ (television) రంగాన్నే కాదు, హిందీ సినిమాలోనూ ఆమె హవా నడిచింది. 1987లో క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్(Vivian Richards) తో సహ జీవనం చేసింది. వీరికి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా (masaba gupta) జన్మించింది. నీనా, రిచర్డ్స్‌లు పెళ్లి చేసుకోలేదు. వీరి బంధం అక్కడితో ముగిసింది. సింగిల్ పేరంట్‌గానే మసాబా గుప్తాను పెంచి పెద్ద చేశారు. నీనా గుప్తా. 2008లో వివేక్ మెహ్రా (vivek mehra)ను వివాహం చేసుకున్నారు. 2015లో నిర్మాత మధు మంతెన(madhu mantena) ను పెళ్లి చేసుకుంది మసాబా. వీరి సంసారం నాలుగేళ్లు కూడా నిలువలేదు. 2019లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఈ ఏడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రా (satyadeep Mishra)ను పెళ్లి చేసుకుంది మసాబా. అన్నట్టు సత్యదీప్‌కు కూడా ఇది రెండో పెళ్లే! అంతకు ముందు అతడు హీరోయిన్ అదితిరావును వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి మసాబాను పెళ్లి చేసుకున్నాడు సత్యదీప్. మధు మంతెనను పెళ్లి చేసుకోమని చెప్పింది నీనా గుప్తానేనట! ఆమె బలవంతం మీదే ఆ పెళ్లి జరిగిందట! ఈ విషయాన్ని నీనా గుప్తానే స్వయంగా వెల్లడించారు. 'రిలేషన్‌షిప్ గురించి సలహాలివ్వడానికి నేను తగను. ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పుడు మనుషులతోనే డేటింగ్ (dating) చేశాను. కాబట్టి నేను మంచి సలహాలు ఇవ్వలేను. అయితే మసాబా విషయంలో మాత్రం ఓ పొరపాటు చేశాను. మసాబా మొదట పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కాబోయే భర్తతో సహజీవనం చేయాలనుకుంది. అందుకు నేను అంగీకరించలేదు. పెళ్లి చేసుకున్నాకే తనతో కలిసి ఉండాలని గట్టిగా చెప్పాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. పెళ్లయిన కొంతకాలానికి వారు విడాకులు తీసుకున్నారు. అప్పుడు నేను చాలా కుంగిపోయాను. వారిద్దరు విడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాను. వాళ్ల జంటను చూసి మేము ముచ్చటపడేవాళ్లం. ఇప్పటికీ నా మాజీ అల్లుడి మీద నాకు అభిమానం ఉంది. విడాకుల వార్త చెప్పగానే నోట మాట రాలేదు. కానీ అది వారి జీవితం.. కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను' అని నీనా గుప్తా తెలిపారు.