నజ్రియా నజీమ్(Nazria Nazim) గుర్తుందా.. ఈ పేరు పెద్దగా గుర్తు పట్టరు కాని.. రాజా రాణి(Raja rani), అంటే సుందరానికి(ante sundharaniki) సినిమాల హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తుకు వస్తుంది. తమిళంలో మంచి ఇమేజ్ ఉన్న ఈ బ్యూటీ.. ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందంట.

నజ్రియా నజీమ్(Nazria Nazim) గుర్తుందా.. ఈ పేరు పెద్దగా గుర్తు పట్టరు కాని.. రాజా రాణి(Raja rani), అంటే సుందరానికి(ante sundharaniki) సినిమాల హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తుకు వస్తుంది. తమిళంలో మంచి ఇమేజ్ ఉన్న ఈ బ్యూటీ.. ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందంట.

రాజా రాణి తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది నజ్రియా నజీమ్. ఇక తెలుగులో నేచురల్ స్టార్ నానికి(Natural star Nani) జోడీగా.. అంటే సుందరానికి సినిమాలో నటించింది బ్యూటీ. అయితే ఈసినిమా తరువాత తెలుగులో అసలుఆఫర్లు లేవు.. సినిమాలు కూడా చేయలేదు నజియా. ఈమె నటించిన రెండు సినిమాల్లో.. ఆమె నటనకు అద్భుతమైన ప్రశంసలులభించాయి. అవ్వడానికి తమిళ డబ్బింగ్ సినిమానే అయినా.. రాజారాణి సినిమాతో నజ్రియాకు టాలీవుడ్ యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది.

ఇక అంటే సుందరానికి సినిమా సరిగ్గా నడవకపోయినా.. ఈసినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. టాలీవుడ్ లో సినిమాలు చేయడం లేదు కాని ఈ స్టార్ బ్యూటీకి సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. నెట్టింట్లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది నజ్రియా. తన ఫ్యామిలీ విషయాలతో పాటు.. పర్సనల్ విషయాలు కూడా పంచుకోవడం అలవాటు ఆమెకు.

ఇక తాజాగా నజ్రియా ఓ సడెన్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట బ్యూటీ. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు కాని.. తాను మాత్రం తన సోషల్ మీడియా పేజ్ లు అన్నింటికిబ్రేక్ ఇవ్వబోతున్నట్టు ఇన్ స్టా స్టేటస్ ద్వారా వెల్లడించింది. ఆమె పోస్ట్ లో ఏం పెట్టిందంటే..? నేను నా అన్ని సోషల్‌ మీడియా ఖాతాల ప్లాట్ ఫామ్స్ నుంచి బ్రేక్‌ తీసుకుందామని అనుకుంటున్నాను. నేను మీ ప్రేమ, సందేశాలను చాలా మిస్‌ అవుతాను. నేను మళ్లీ తిరిగి వస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను అని పేర్కొన్నారు. దాంతో ఆమె ఫ్యాన్స్ డిస్సాయింట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

Updated On 14 May 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story