లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) పెద్దగా సినిమా ప్రమోషన్లలో(Movie Promotions) పాల్గొనరు. అంత పెద్ద సినిమా జవాన్‌(JAwan) ప్రమోషన్లకే ఆమె హాజరుకాలేదు. ఆమె మీడియాతో కూడా ముచ్చటించరు. చాలా అరుదుగా మీడియా ముందుకు వస్తుంటారు నయనతార.

లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) పెద్దగా సినిమా ప్రమోషన్లలో(Movie Promotions) పాల్గొనరు. అంత పెద్ద సినిమా జవాన్‌(JAwan) ప్రమోషన్లకే ఆమె హాజరుకాలేదు. ఆమె మీడియాతో కూడా ముచ్చటించరు. చాలా అరుదుగా మీడియా ముందుకు వస్తుంటారు నయనతార. అలాంటిది రీసెంట్‌గా చెన్నైలో అనుకోకుండా మీడియా ముందుకొచ్చారు నయనతార. ఈ సందర్భంగా ఆమె జవాన్‌ సినిమా గురించి మాట్లాడారు. తాను చిన్నప్పట్నుంచి షారూక్‌ఖాన్‌కు(Shahrukh Khan) వీరాభిమానినని చెప్పారు. దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే(DDLJ) సినిమాను 50సార్లకుపైగానే చూసి ఉంటానన్నారు నయన్‌. 'షారూక్‌ను నేరుగా చూస్తే చాలనుకునేదానిని. ఓ సారి ఓ ఫంక్షన్‌లో షారూక్‌ను కలిసే అవకాశం దొరికింది. అప్పుడు ఆయన నిన్ను బాలీవుడ్‌కు తీసుకెళ్లిపోతా అంటూ నాతో సరదాగా అన్నారు. ఆ సమయంలో బహుశా తథాస్తు దేవతలు తథాస్తూ అని అన్నారేమో! అందుకే ఆయన సినిమాతోనే బాలీవుడ్‌లో అడుగపెట్ఆను. బాలీవుడ్‌లో నా మొదటి సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది' అని నయనతార అన్నారు. బాలీవుడ్‌లో కంటిన్యూ అవుతారా అన్న ప్రశ్నకు క్యారెక్టర్‌ నచ్చితే ఏ భాషలోనైనా నటిస్తానని బదులిచ్చారు నయనతార.

Updated On 21 Sep 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story