ఇప్పుడైతే నయనతారను(Nayanthara) సౌత్‌ లేడి సూపర్‌స్టార్‌ అంటున్నారు కానీ రేపొద్దున జవాన్‌(Jawan) రిలీజ్‌ అయ్యాక ఆల్‌ ఇండియా లేడి సూపర్‌స్టార్‌ అవ్వడం ఖాయం! రెండు దశాబ్దాలుగా ఆమె కథానాయికగా అలరిస్తూ వస్తున్నారు. గ్లామర్‌ పాత్రలతో పాటు లేడి ఓరియెంటెడ్‌ సినిమాలు కూడా చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇన్నేళ్లయినా నయనతార రేంజ్‌ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు.

ఇప్పుడైతే నయనతారను(Nayanthara) సౌత్‌ లేడి సూపర్‌స్టార్‌ అంటున్నారు కానీ రేపొద్దున జవాన్‌(Jawan) రిలీజ్‌ అయ్యాక ఆల్‌ ఇండియా లేడి సూపర్‌స్టార్‌ అవ్వడం ఖాయం! రెండు దశాబ్దాలుగా ఆమె కథానాయికగా అలరిస్తూ వస్తున్నారు. గ్లామర్‌ పాత్రలతో పాటు లేడి ఓరియెంటెడ్‌ సినిమాలు కూడా చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇన్నేళ్లయినా నయనతార రేంజ్‌ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు. అన్నింటినీ తట్టుకుని నిలబడగలిగారు. నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న నయనతార హీరోయిన్‌గా 75 సినిమాలు చేశారు. ఇంకా దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె షారుక్‌ ఖాన్‌(Shahrukh Khan) సరసన జవాన్‌ సినిమాలో నటించారు. హిందీలో ఆమెకు ఇదే మొదటి సినిమా. లేటెస్ట్‌గా నయనతారకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. తమిళంలో సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌(Lokesh kanakaraj) దర్శకత్వంలో నయనతార నటించబోతున్నారన్నదే తాజా సమాచారం.

తొలి చిత్రం మా నగరం నుంచి ఈ మధ్య విడుదలైన విక్రమ్‌ వరకు అపజయం అనేది ఎరుగకుండా సక్సెస్‌ ఫుల్‌ ప్రయాణం చేస్తున్న దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌. ప్రస్తుతం విజయ్‌(Vijay) హీరోగా నటిస్తున్న లియో(LEO) చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతున్నది. ఈ సినిమా తర్వాత లోకేష్‌ కనకరాజు రెండు మూడు సినిమాలు కమిట్‌ అయ్యారు. ఇందులో కమలహాసన్‌తో భారీ సక్సెస్‌ను అందుకున్న విక్రమ్‌ సినిమాకు సీక్వెల్‌ ఉండబోతున్నది. అలాగే కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమాకు కూడా సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. అలాంటిది అనూహ్యంగా నయనతార హీరోయిన్‌గా లోకేష్‌ కనకరాజ్‌ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారనే వార్త తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇందులో లారెన్స్‌(Lawrence) హీరోగా నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దీనిపై క్లారిటీ రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు.

Updated On 4 Sep 2023 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story