మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించబోయే తర్వాతి సినిమాలో ఆయన సరసన నటించేది ఎవరు? ఎవరైనా బాగుంటుంది? అని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara), అనుష్క షెట్టిలలో(Anushka Shetty) ఎవరో ఒకరు చిరంజీవి సరసన నటించే ఛాన్సుంది. ప్రస్తుతం ఈ సీనియర్ కథానాయికలిద్దరి సిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

Chiranjeevi Next Film
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించబోయే తర్వాతి సినిమాలో ఆయన సరసన నటించేది ఎవరు? ఎవరైనా బాగుంటుంది? అని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara), అనుష్క షెట్టిలలో(Anushka Shetty) ఎవరో ఒకరు చిరంజీవి సరసన నటించే ఛాన్సుంది. ప్రస్తుతం ఈ సీనియర్ కథానాయికలిద్దరి సిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నయనతార అక్కడ కూడా ప్రేక్షకులను ప్రశంసలను అందుకుంటున్నారు. మరోవైపు అనుష్క షెట్టి సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి కూడా థియేటర్లలో హంగామా చేస్తున్నది. ఈ సీనియర్ నటీమణుల నటనకు పేరుపెట్టలేము. ఇప్పటికీ వారు తమకు వచ్చిన పాత్రలను అవలీలగా పోషిస్తున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్నదన్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఫాంటసీ కథతో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబరులో కానీ, నవంబరులో కానీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం కథానాయికల ఎంపికపై దృష్టి పెట్టారు మేకర్స్. అనుష్క, నయనతార పేర్లతో పాటు, బాలీవుడ్‌కి చెందిన ఓ హీరోయిన్ పేరుని కూడా పరిశీలిస్తున్నారు. మరి చిరంజీవి సరసన నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
