లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) మొహంలో కోపం అన్నది ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అలాంటి నయన్ ఓ అభిమానిపై గట్టిగానే సీరియస్ అయ్యింది. తనను వీడియో తీయడానికి ప్రయత్నించిన ఫ్యాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త విఘ్నేశ్(Vignesh Shivan)తో కలిసి కుంభకోణం దగ్గరలో ఉన్న మెళవత్తూర్ గ్రామంలోని కామాక్షి అమ్మవారి ఆలయాని(Kamakshi Ammavari Temple)కి వచ్చింది. ఆ అమ్మవారు ఈ దంపతుల కులదైవం . నయనతార వచ్చిందనే విషయం తెలుసుకున్న జనం భారీ సంఖ్యలో వచ్చారు.

Nayanthara Gets Angry On Fan Misbehaving
లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) మొహంలో కోపం అన్నది ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అలాంటి నయన్ ఓ అభిమానిపై గట్టిగానే సీరియస్ అయ్యింది. తనను వీడియో తీయడానికి ప్రయత్నించిన ఫ్యాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త విఘ్నేశ్(Vignesh Shivan)తో కలిసి కుంభకోణం దగ్గరలో ఉన్న మెళవత్తూర్ గ్రామంలోని కామాక్షి అమ్మవారి ఆలయాని(Kamakshi Ammavari Temple)కి వచ్చింది. ఆ అమ్మవారు ఈ దంపతుల కులదైవం . నయనతార వచ్చిందనే విషయం తెలుసుకున్న జనం భారీ సంఖ్యలో వచ్చారు.అదే సమయంలో ఓ అభిమాని నయనతారతో సెల్ఫీ వీడియో తీయబోయాడు. ఇది గమనించిన నయనతార అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో తీస్తే ఫోన్ పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలాకాలంపాటు ప్రేమికులుగా ఉన్న నయనతార, విఘ్నేశ్‌లు నిరుడు పెళ్లితో ఒక్కటయ్యారు. ఇటీవల సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనించారు. మొన్నీమధ్యనే తమ పిల్ల పూర్తి పేర్లను కూడా తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత ఈ దంపతులు విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు చేసేస్తున్నారు. ఈ సందర్భంగానే తమ కులదైవం కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. వారిని ప్రశాంతంగా పూజలు చేసుకోనివ్వలేదు అభిమానులు. ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఓ మహిళా అభిమాని నయనతార వెనుకవైపు నుంచి ఆమె భుజంపై చేయి వేసింది. అప్పుడు కూడా నయనతార ఆగ్రహించింది. పూజలు చేస్తున్నప్పుడు కూడా కొందరు భక్తులు ఫోటోలు, వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా నయన్‌కు కోపం వచ్చింది. ఒక్క అయిదు నిమిషాలు ఆగండి.. మా పూజ పూర్తవుతుంది. మేము కూడా మీలాగే అమ్మవారి ఆశీస్సుల కోసమే వచ్చామని చెప్పింది నయన్.
