అందానికి అందం, అభినయానికి అభినయం ఈ రెండూ లేడి సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) సొంతం.. సుదీర్ఘ కాలం నుంచి ఆమె అగ్రతారగా నిలుస్తూ వస్తున్నారంటే అందుకు కారణాలు ఇవే! కేరళలో చిన్న ఊళ్లో పుట్టిన డయానా మరియం కురియన్ తిరువనంతపురం చేరడం, అక్కడి నుంచి చెన్నై నగరానికి చేరుకోవడం నయనతారగా మారి అగ్ర కథనాయికగా ఎదగడం అన్నీ చకచక జరిగిపోయాయి. సినీ కెరీర్‌లో నయనతార ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడు నయనతార క్రేజీ ఇండియన్ హీరోయిన్. అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న అగ్ర కథానాయిక. రెండుసార్లు ప్రేమలో విఫలమయ్యారు. మొదట్లో నటుడు శింబును గాఢంగా ప్రేమించిన నయనతార అది పెళ్లి వరకు వెళుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. మధ్యలోనే బ్రేక్ అయ్యింది. తర్వాత డాన్స్ డైరెక్టర్, యాక్టర్ అయిన ప్రభుదేవాతో (Prabhu Deva) ప్రేమ వ్యవహారం నడిపారు. ఈ ప్రేమ కూడా దాదాపు పెళ్లి వరకు వచ్చింది. ఓ దశలో ఇక పెళ్లి చేసుకోకూడదనే వైరాగ్యానికి వచ్చారు. అలాంటిది దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. ఇప్పుడూ నటిస్తూనే ఉన్నారు.

Nayanthara hopes in shah rukh khan Jawan Movie

పెళ్లి తర్వాత కెరీర్ అంత ఆశాజనకంగా సాగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. భారీ చిత్రాల అవకాశాలైతే వస్తున్నాయి కానీ అవి బాక్సాఫీసు దగ్గర చతికిలపడుతున్నాయి. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు. షారూక్ ఖాన్‌తో (Shah Rukh Khan) కలిసి జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది హిట్టయితే నయనకు బాలీవుడ్‌లో రెడ్ కర్పెట్ పరుస్తారు. లేడి సూపర్‌స్టార్ హోదాను అనుభవించిన నయనతార ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆమె తన 75 సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రమే. ఇందులో జై హీరోగా నటిస్తున్నాడు. రాజారాణి చిత్రం తర్వాత వీళ్లు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తిరుచ్చి, చెన్నయ్‌ల బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే కథ ఇది. ఇందులో నయనతార మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతిగా నటిస్తున్నారు. ఒక చోట కలిసి పని చేసే నయనతార, జై మధ్య ప్రేమ దర్శకుడు కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారట!