నయనతార(Nayantara), విఘ్నేశ్ శివన్(Vignesh Shivan) జంట సరోగసి(Surrogacy) ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే కదా! తల్లిదండ్రులైన ఈ దంపతులు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు పిల్లల మొహాలను చూపించలేదు సరే, పేర్లయినా చెప్పొచ్చు కదా అని అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఇవాళ ఆ కొరత తీర్చారు నయన్, విఘ్నేశ్ దంపతులు. చాలా రోజుల తర్వాత తమ పిల్లలకు ఏ పేర్లు పెట్టారో నయన్ తెలియచేసింది.
నయనతార(Nayantara), విఘ్నేశ్ శివన్(Vignesh Shivan) జంట సరోగసి(Surrogacy) ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే కదా! తల్లిదండ్రులైన ఈ దంపతులు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు పిల్లల మొహాలను చూపించలేదు సరే, పేర్లయినా చెప్పొచ్చు కదా అని అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఇవాళ ఆ కొరత తీర్చారు నయన్, విఘ్నేశ్ దంపతులు. చాలా రోజుల తర్వాత తమ పిల్లలకు ఏ పేర్లు పెట్టారో నయన్ తెలియచేసింది. మీడియాతో చిట్‌చాట్ సెషన్‌లో మాట్లాడారు. తన పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్.శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దివిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan) అని పేర్లు పెట్టినట్టు తెలిపారు. నయన్, విఘ్నేశ్ పేర్లు కలిసి వచ్చేలా ఇద్దరు పిల్లలకు పేర్లు పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు విఘ్నేశ్ కూడా ఫ్యామిలీ ఫోటోను షేర్ చేస్తూ పిల్లల పేర్లు వెల్లడించాడు. ఈ ఫ్యామిలీ ఫోటోలో కిటికీ దగ్గర నయన్ కూర్చొని ఉన్నారు. ఆమె చేతిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రపంచంలోనే ఉత్తమ తల్లి చేతిలో పిల్లలు ఉన్నారు. మా పిల్లల పేర్లను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని క్యాప్షన్‌లో రాశారు విఘ్నేశ్. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో కలిసి జవాన్ సినిమాలో నయనతార నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ రెండున విడుదల కాబోతున్నది. పిల్లల పేర్లపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. పేర్లు చాలా కొత్తగా ఉన్నాయని కొందరు అంటున్నారు. పలకడానికి కష్టంగా ఉన్నాయని మరికొందరు చెప్పారు.