ఈ మధ్య తెలుగు సినిమాలు చేయడం తగ్గించేసింది.. తమిళ స్టార్ బ్యూటీ నయనతార(Nayanthara). ఎక్కువగా తమిళ సినిమాలు చేసుకుంటుంది. అంతే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతుంది కదా.. అందుకేనేమో.. తెలుగు సినిమాలు అంటే కొన్ని కండీషన్లు పెడుతందట.

ఈ మధ్య తెలుగు సినిమాలు చేయడం తగ్గించేసింది.. తమిళ స్టార్ బ్యూటీ నయనతార(Nayanthara). ఎక్కువగా తమిళ సినిమాలు చేసుకుంటుంది. అంతే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతుంది కదా.. అందుకేనేమో.. తెలుగు సినిమాలు అంటే కొన్ని కండీషన్లు పెడుతందట.

సౌత్ లో స్టార్ గా అతి తక్కువ టైమ్ లో ఎదిగింది నయనతార. హీరోయిన్ గా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో స్టార్డమ్ కూడా సాధించింది నయనతార. అంతే కాదు సౌత్ లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా ఆమె సొంతం అయ్యింది. నిజంగానే తాను సూపర్ స్టార్ అని నిరూపించుకుంది బ్యూటీ. పేరుకు, వయస్సుకు తగ్గట్టుగానే సినిమాలు చేసుకుంటూ.. వయస్సు పెరుగుతున్నా కొద్ది దూకుడు కూడా పెంచేస్తోంది. ఫెయిడ్ అవుట్ అవ్వల్సిన టైమ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది

కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.. నయనతార. పలు రకాలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి స్టార్ హీరోలకు పోటీగా తన చిత్రాలను విడుదల చేస్తూ ఉంటుంది నయనతార. నయనతార తమిళ సినిమాలతో మాత్రమే స్టార్ గా మారడలేదు. తెలుగు సినిమాలు చేసి.. తెలుగులో హిట్లు సాధించిన తరువాతే ఆమెకు స్టార్ డమ్ వచ్చింది. దాంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజీ సంపాదించుకుంది నయనతార. వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకుంటూ ఉండేది. స్టార్ హీరోలు సీనియర్ హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కూడా నటించింది నయనతార.

అంత మంచి కెరీర్ ను అందించి టాలీవుడ్ పై నయనతార ప్రస్తుతం అంతగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కొన్ని సినిమాలు పక్కాగా నయనతారతో సినిమాచేయాలి అని అనుకునేవారు. న తెలుగు నిర్మాతలకు రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగి అందరికీ షాక్ ఇస్తోందట నయనతార. టాలీవుడ్ సినిమాల్లో తాను నటించాలి అంటే.. ఆ సినిమాలో హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్ తనకు కూడా కావాలంటూ ఒక డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనే విషయం తెలియదు కానీ..ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Updated On 6 Aug 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story