నాలుగు పదుల వయసులోనూ నవయవ్వన జవ్వనిలా మెరిసిపోతున్న నయనతారకు(Nayanthara) ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. తరచూ వివాదాలలో చిక్కుకునే నయనతార ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు.

నాలుగు పదుల వయసులోనూ నవయవ్వన జవ్వనిలా మెరిసిపోతున్న నయనతారకు(Nayanthara) ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. తరచూ వివాదాలలో చిక్కుకునే నయనతార ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు. సినిమాలలో నటిస్తూనే వ్యాపారరంగాలలో ప్రతిభను చాటుకుంటున్నారు. దర్శకుడు, చెలికాడు విఘ్నేశ్‌ శివన్‌ను(Vignesh Shivan) పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా కవలలకు తల్లి అయ్యారు నయనతార. అయినప్పటికీ ఆమె సూపర్‌స్టార్‌ హోదా అలాగే నిలుపుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె చాలా బిజీ.

చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఇటీవలే బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు. షారూక్‌ ఖాన్‌(Shahrukh Khan) నటించిన జవాన్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఉత్తరాదిలోనూ అభిమానులను ఏర్పరచుకున్నారు. జవాన్‌ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టవ్వడంతో బాలీవుడ్‌లోనూ నయనతార క్రేజ్‌ అమాంతం పెరిగింది. దీంతో అక్కడ మరిన్ని అవకాశాలు వస్తున్నయి. ప్రస్తుతం బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ(Sanjay Leela Bhansali) తాజా సినిమాలో నయనతార ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నారట! ప్రస్తుతం మేకర్స్‌ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట!

జవాన్‌ సినిమాకు పది కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్న నయనతార కొత్త సినిమాకు ఏకంగా 13 కోట్ల రూపాయలను డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తతం నయనతార తమిళంలో తన 75వ చిత్రంతోపాటు, క్రికెట్‌ నేపథ్యంలో రూపొందుతున్న టెస్ట్‌, మన్నాంగట్టిసిన్స్‌ 1960 చిత్రాల్లో నటిస్తోంది. నటుడు జయం రవి సరసన మరోసారి తనీ ఒరువన్‌–2 చిత్రంలో నయనతార నటించనున్నట్లు టాక్‌ నడుస్తోంది.

Updated On 20 Oct 2023 7:02 AM GMT
Ehatv

Ehatv

Next Story