ఏజ్ బార్ అవుతున్నా.. ఏమాత్రం తగ్గేది లేదంటున్న నయనతార(Nayathara). వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రెమ్యూనరేషన విషయంలో కూడా గట్టిగా డిమాండ్ చేస్తోంది సీనియర్ బ్యూటీ.

ఏజ్ బార్ అవుతున్నా.. ఏమాత్రం తగ్గేది లేదంటున్న నయనతార(Nayathara). వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రెమ్యూనరేషన విషయంలో కూడా గట్టిగా డిమాండ్ చేస్తోంది సీనియర్ బ్యూటీ.

40 ఏళ్ళు వచ్చినా.. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. తాజాగా ఆమె ఇమేజ్ బాలీవుడ్ కు కూడా పాకింది. సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నయనతార. సౌత్ లేడీ సూపర్ స్టార్(Lady superstar) గా ఎదిగింది . హీరోయిన్ల కెరీర్ టైమ్ మహా అయితే 30.. కాని 40 ఏళ్ళు వస్తున్నా.. హీరోయిన్ గా అదే డిమాండ్ తో దూసుకుపోతోంది నయనతార. ఇక రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. రేటు పెంచుతూనే ఉంది. ఇటు సినిమాలు, అటు కమర్షియల్స్(Commercials).. వాటితో పాటు సొంతంగా బిజినెస్ లు.. ఇలా చేతినిండా సంపాదిస్తూ.. సొంత ఎయిర్ జెట్(Private Jet) ప్లేయిన్ కూడా కొనేరేంజ్ కు ఎదిగింది నయన్.

ఈ క్రమంలో.. నయనతార రెమ్యూనరేషన్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.10 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ.. యాడ్స్ లో నటిస్తే.. కోటి రెండు కోట్లు తీసుకుంటుందట. అయితే ఇప్పుడు యాడ్స్ విషయంలో కూడా ఆమె రేటు భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.
ఇక ప్రస్తుతం ఒక్క యాడ్(Advertisement) కు 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదికూడా 50 సెకండ్ల యాడ్ కోసం ఆమె అంత డిమాండ్ చేస్తుదంట.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరైన నయనతార ఆస్తులు 200 కోట్లకు పైమాటే అట. ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నశిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ వంటి నటీమణుల్లో నయనతార కూడా ఉన్నారు. నయన్ దగ్గర 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. ఇందులో నయన్ తో పాటు.. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ వృత్తిపరమైన పనులు, విహార యాత్రలకు దీన్ని ఉపయోగిస్తారని సమాచారం.

Updated On 1 Oct 2023 4:04 AM GMT
Ehatv

Ehatv

Next Story