లేడి సూపర్‌స్టార్‌ నయనతారకు(Nayanthara) ఆల్‌ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఓ పక్క గ్లామరస్‌ పాత్రలు చేస్తూనే మరో పక్క పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రల్లో నటిస్తూ అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు నయన్‌. ఇప్పటికే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌తో(shahrukh Khan) కలిసి నటించిన జవాన్‌ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత నయన్‌కు మరింత మంది అభిమానులుగా మారిపోవడం ఖాయం. రీసెంట్‌గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) అడుగుపెట్టారు. తన పిల్లలతో ఉన్న ఫోటోను తొలి పోస్ట్‌గా షేర్‌ చేశారు.

లేడి సూపర్‌స్టార్‌ నయనతారకు(Nayanthara) ఆల్‌ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఓ పక్క గ్లామరస్‌ పాత్రలు చేస్తూనే మరో పక్క పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రల్లో నటిస్తూ అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు నయన్‌. ఇప్పటికే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌తో(shahrukh Khan) కలిసి నటించిన జవాన్‌ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత నయన్‌కు మరింత మంది అభిమానులుగా మారిపోవడం ఖాయం. రీసెంట్‌గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) అడుగుపెట్టారు. తన పిల్లలతో ఉన్న ఫోటోను తొలి పోస్ట్‌గా షేర్‌ చేశారు. ఇలా ఆమె పోస్ట్‌ పెట్టారో లేదో నెటిజన్లు, ఫాలోవర్లు, అభిమానులు ఒక్కసారిగా నయనతార ఇన్‌స్టా అకౌంట్‌పై దాడి చేశారు. కొన్ని గంటల్లోనే ఆమెకు పది లక్షలకు పైగా ఫాలోవర్లు వచ్చారంటే ఆమె క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలో (24 గంటల్లోపే) మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన హీరోయిన్‌గా రికార్డు క్రియేట్‌ చేశారు నయనతార. గతంలో బాలీవుడ్ భామ కత్రినాకైఫ్‌ మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను చేరుకునేందుకు 24 గంటలు దాటింది. గంటల్లోనే మిలియన్ ఫాలోవర్లను దాటేసిన నయన్‌ మరికొన్ని రోజుల్లోనే 10 మిలియన్ల ఫాలోవర్లు సంపాదించుకోవడం పక్కా అని అంటున్నారు మూవీ లవర్స్‌. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న జవాన్‌ చిత్రంలో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా కనిపించబోతున్నారు. జవాన్‌లో షారుఖ్‌ ఖాన్‌ తండ్రి, కొడుకులుగా డ్యుయల్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరవనున్నారు.

Updated On 1 Sep 2023 8:12 AM GMT
Ehatv

Ehatv

Next Story