అందం, అభినయం లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) సొంతం. ఈ రెండు క్వాలిటీలే ఆమెను ఇన్నేళ్లుగా అగ్రతారగా నిలిపాయి. సంచలనాలకు ఆమె పెట్టింది పేరు. కేరళ(Kerala)లో మారుమూల గ్రామంలో పుట్టి తిరువనంతపురం చేరి అక్కడ్నుంచి చెన్నై(Chennai) మహానగరానికి వచ్చిన డయానా మరియం కురియన్‌(Diana Mariam Kurian) అటు పిమ్మట నయనతారగా ప్రేక్షకుల మనస్సులో స్థిరపడిపోయారు.

అందం, అభినయం లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) సొంతం. ఈ రెండు క్వాలిటీలే ఆమెను ఇన్నేళ్లుగా అగ్రతారగా నిలిపాయి. సంచలనాలకు ఆమె పెట్టింది పేరు. కేరళ(Kerala)లో మారుమూల గ్రామంలో పుట్టి తిరువనంతపురం చేరి అక్కడ్నుంచి చెన్నై(Chennai) మహానగరానికి వచ్చిన డయానా మరియం కురియన్‌(Diana Mariam Kurian) అటు పిమ్మట నయనతారగా ప్రేక్షకుల మనస్సులో స్థిరపడిపోయారు. 2002లో మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన నయనతార 2005లో అయ్యా సినిమాతో కోలీవుడ్‌(Kollywood)కు ఎంట్రీ ఇచ్చారు. నయనతార కెరీర్‌లో ఎన్నో ఉత్థానపతనాలను చూశారు. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడారు. అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు నయనతార క్రేజీ ఇండియన్‌ హీరోయిన్‌. అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న అగ్ర కథానాయిక. రెండుసార్లు ప్రేమలో విఫలమయ్యారు. ఓ దశలో ఇక పెళ్లి చేసుకోకూడదనే వైరాగ్యానికి వచ్చారు. అలాంటిది విఘ్నేశ్‌ను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. నాలుగు పదలు వయసులోనూ ఫిట్‌నెస్‌ను, సౌందర్యాన్ని అలాగే మెయింటైన్‌ చేస్తున్నారు. అందంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌ రహస్యం వివరాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నయనతార ఎప్పుడూ నాజూకుగా, ఫిట్‌ఆ ఉండటానికి కారణం జిమ్‌ వర్కౌట్స్‌, యోగాలేనట. ముఖ్యంగా నయనతార ఫిట్‌నెస్‌కు యోగా బాగా ఉపకరించింది. నయనతార రోజూ రెండు గంటల పాటు యోగా చేస్తారు. ఆమె డైట్‌ ప్లానింగ్‌లో తప్పనిసరిగా కొబ్బరినీళ్లు ఉండాలి. ఉదయం అల్పాహారంలో పళ్లరసం తప్పకుండా ఉండాలట. ఎందుకంటే పళ్లరసం బరువును తగ్గించడంతోపాటు ఎనర్జీ పెరగడానికి దోహదపడుతుంది. లంచ్‌లో నాన్‌ వెజ్‌, గుడ్డు, కాయగూరలు సమపాళ్లలో తీసుకుంటారు నయనతార. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌ కలిగిన పదార్థాలను దూరంగా పెడతారు. ఇకపోతే రోజుకు 8 గంటలు నిద్ర పోవడమనే అలవాటును క్రమం తప్పకుండా పాటిస్తున్నారు నయనతార. మంచి నిద్రవల్ల కూడా బరువును కంట్రోల్‌లో ఉంచగలుగుతున్నారు నయనతార.

Updated On 6 Jun 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story