షారుఖ్ ఖాన్ (Shah Rukh khan) హీరోగా అట్లీ కుమార్ (Atlee Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ (Jawan) సినిమాలో నయనతార (Nayanthara) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలోని ఓ సాంగ్‌లో కీలకమైన రిమాన్స్ సీన్ లీక్ అవడంతో మూవీ టీమ్ షాక్ అయింది. ఆ వీడియోలో నయనతార రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపిస్తుండగా.. షారుఖ్ ఖాన్ వైట్ కలర్ డ్రెస్‌లో కనిపిస్తున్నారు.

Shah Khan Romance Nayantara

యూత్ ఐకాన్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ట్యూన్ చేసిన ఈ పాటకు ఫరా ఖాన్ (Farah Khan) కొరియోగ్రఫీ చేయగా.. అర్జిత్ సింగ్ (Farah Khan) పాడిన ఈ రొమాంటిక్ సాంగ్ కు షారుఖ్, నయనతార డ్యాన్స్ చేశారు. ముంబై తీరంలోని సముద్రం మధ్యలో లగ్జరీ బోట్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్ వీడియోను లీక్ చేసి.. ఇంటర్నెట్లో ఎవరు అప్లోడ్ చేశారనే దానిపై డైరెక్టర్ అట్లీ టీమ్ ఆరా తీస్తోంది.
ఈ జవాన్ (Jawan) సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ (Red Chillies Entertainment) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపలి, నయనతార, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, దీపికా పదుకొనే ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంతమేరకు పూర్తయిందని.. ఇంక ఒక పాటతోపాటు కొన్ని ప్యాచ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయంటున్నారు. స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ ఏడాది జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ జవాన్ చిత్రం.