లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara), జయం రవి(Jayam Ravi) ప్రధాన పాత్రలలో నటించిన తమిళ సినిమా ఇరైవన్‌(Iraivan)! ఈ సినిమాను సుధన్‌ సుందరం, జి.జయరామ్‌లు నిర్మించారు. అహ్మద్‌ దర్శకత్వం వహించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో గాడ్‌(God) అనే పేరుతో విడుదల చేయనున్నారు.

లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara), జయం రవి(Jayam Ravi) ప్రధాన పాత్రలలో నటించిన తమిళ సినిమా ఇరైవన్‌(Iraivan)! ఈ సినిమాను సుధన్‌ సుందరం, జి.జయరామ్‌లు నిర్మించారు. అహ్మద్‌ దర్శకత్వం వహించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో గాడ్‌(God) అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సినిమాకు చెందిన ఓ కొత్త పోస్టర్‌ను(Poster) సోషల్‌ మీడియాలో పంచుకుంది. నయనతార, జయం రవి సీరియస్‌ లుక్స్‌లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచారు. ఆద్యంతమూ ఉత్కంఠభరితంగా సాగుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీన తమిళ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. మరి తెలుగులో కూడా ఇదే రోజున విడుదల అవుతుందా? లేక కొన్ని రోజుల తర్వాత రిలీజ్‌ అవుతుందా? అన్నది చూడాలి.

Updated On 25 Sep 2023 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story