లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. 40 ఏళ్ల వయసు, అందులోనూ పెళ్లయి ఇద్దరు పిల్లలు అయినా మునుపటిలాగే క్రేజు. తీరిక లేనన్ని సినిమాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌(Pan India Heroine). ఆ మధ్యన బిజినెస్‌లో కూడా ఎంటరయ్యారు. అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నయనతారకు బిగ్గెస్ట్‌ హిట్‌ ఏమీ లేకపోయినా ఆమెకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు.

లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. 40 ఏళ్ల వయసు, అందులోనూ పెళ్లయి ఇద్దరు పిల్లలు అయినా మునుపటిలాగే క్రేజు. తీరిక లేనన్ని సినిమాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌(Pan India Heroine). ఆ మధ్యన బిజినెస్‌లో కూడా ఎంటరయ్యారు. అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నయనతారకు బిగ్గెస్ట్‌ హిట్‌ ఏమీ లేకపోయినా ఆమెకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. మొన్నామధ్య షారూక్‌ఖాన్‌తో(Shah Ruk Khan) కలిసి జవాన్‌లో(Jawan) నటించి బాలీవుడ్‌లోనూ సత్తా చాటుకున్నారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో నయనతారను వెతుక్కుంటూ మేకర్స్‌ వస్తున్నారు. ప్రస్తుతం నయనతార నటిస్తున్న మన్నాంగట్టి సిన్స్‌ 1960(Mannangatti since 1960) అనే సినిమా దాదాపుగా పూర్తయ్యింది. విడుదలకు సిద్ధంగా ఉంది. ఉమెన్‌ సెంట్రిక్‌గా ఈ సినిమా ఉంటుంది. అలాగే మాధవన్‌, సిద్దార్థ్‌ హీరోలుగా నటిస్తున్న టెస్ట్ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. మలయాళంలో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పుడు అజిత్‌ సరసన నటించడానికి రెడీ అవుతున్నారట! నిజానికి అజిత్‌, నయనతారలది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్. వీరిద్దరు ఏగన్‌(Egan), బిల్లా(Billa), ఆరంభం(Arambham), విశ్వాసం(Vishwasam) వంటి సినిమాలలో నటించారు. వీటిలో ఏగన్‌ తప్ప మిగతా మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం అజిత్‌ విడాయుయర్చి(Vidayuyarchi) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కావొస్తోంది. దీని తర్వాత ఆయన 63వ సినిమాలో నటించబోతున్నారు. ఆధిక్‌ రవిచంద్రన్‌(Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ(Good Bad Ugly) అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఈ టైటిల్‌ బాగుందంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఈ సినిమాలో ట్రిపుల్‌ రోల్‌ పోషిస్తున్నారట! అజిత్‌ సరసన టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రీలీల(sreeleela), సిమ్రాన్(simran), మీనా(Meena) నటిస్తున్నారట! ఇక ఇప్పుడు నయనతార పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్‌లో సెట్‌ పైకి వెళ్లనుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో నయనతార మూడు రోజుల పాటు పాల్గొనబోతున్నారట. ఈ సినిమా కోసం నయనతార 10 కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాక్‌. మరోవైపు అజిత్ పారితోషికం 163 కోట్ల రూపాయలట!

Updated On 24 May 2024 12:45 AM GMT
Ehatv

Ehatv

Next Story