శైలేస్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) నటిస్తున్న సైంధవ్ (Saindhav) చిత్రం ఫస్ట్‏లుక్‏ను మేకర్స్ విడుదల చేశారు. వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలోని కానుంది. ఈ సందర్భంగా నవాజుద్దీన్ లుక్‏ను విడుదల చేశారు.

శైలేస్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) నటిస్తున్న సైంధవ్ (Saindhav) చిత్రం ఫస్ట్‏లుక్‏ను మేకర్స్ విడుదల చేశారు. వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలోని కానుంది. ఈ సందర్భంగా నవాజుద్దీన్ లుక్‏ను విడుదల చేశారు. ఈ సినిమాలో వికాస్ మాలిక్ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. పోస్టర్‏లో ఆయన కాస్ట్లీ కారు బొన్నెట్ మీద కూర్చుని బీడీ తాగుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. రూహానీ శర్మ, ఆండ్రియా జరేమియాలు ఇందులో ఉన్నారు. రీసెంట్‏గానే ఈ ముగ్గురు భామల ఫస్ట్ లుక్‏ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్.శ్రద్దా క్యారెక్టర్ మనోజ్ఞ కాగా, డాక్టర్ రేణు పాత్రలో రుహానీ శర్మ, జాస్మిన్ క్యారెక్టర్‏లో ఆండ్రియా నటిస్తున్నారు.

ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న సైంధవ్ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ గ్యారీ బీహెచ్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఉన్నారు. నిహారిక ఎంటర్ టైన్‏మెంట్స్ బ్యానర్‏పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నారు. వెంకటేష్ (Venkatesh) కెరీర్ లోనే ఫస్ట్ ఫ్యాన్ ఇండియన్ సినిమా రాబోతున్న ఈ సైంధవ్ (Saindhav) బాక్సాఫీసు దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

Updated On 20 May 2023 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story