ముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖి(Nawazuddin Siddiqui)- ఆలియా(Aaliya)లు విడిపోయి చాన్నాళ్లే అయ్యింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య , ఆస్తుల గొడవలు సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మామూలయ్యాయి. ఇప్పుడు తన మాజీ భార్య ఆలియాపై పరువు నష్టం దావా వేశారు నవాజుద్దీన్ సిద్ధీఖీ.

Nawazuddin Siddiqui
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖి(Nawazuddin Siddiqui)- ఆలియా(Aaliya)లు విడిపోయి చాన్నాళ్లే అయ్యింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య , ఆస్తుల గొడవలు సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మామూలయ్యాయి. ఇప్పుడు తన మాజీ భార్య ఆలియాపై పరువు నష్టం దావా వేశారు నవాజుద్దీన్ సిద్ధీఖీ. సోసల్ మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై ఆలియా అనేకానేక ఆరోపణలు చేస్తుండటంతో నవాజుద్దీన్ అసహనం చెందారు. తనపై ఆలియా అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని నవాజుద్దీన్ బాంబే హైకోర్టులో దావా వేశారు.
మాజీ భార్య ఆలియాతో పాటు తన సోదరుడు షంసుద్దీన్‌పై కూడా వంద కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. తక్షణమే తనకు క్షమాపణలు చెప్పాలని, ఇక ముందు సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగించే ఎలాంటి పోస్టులు పెట్టకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరారు నవాజుద్దీన్. 2008 నుంచి ఇటీవలి కాలం వరకు నవాజుద్దీన్ దగ్గర ఆయన సోదరుడు షంసుద్దీన్ మేనేజర్‌గా పని చేశారు. ఆ సమయంలో షంసుద్దీన్ తన క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు తీసుకుని తన డబ్బును కాజేశాడని, తనను ఆర్ధికంగా మోసం చేశాడనని పిటిషన్‌లో నవాజుద్దీన్ తెలిపారు. ఆలియా, షంసుద్దీన్ ఒక్కటై తనపై తప్పుడు కేసులు పెట్టారని నవాజ్ పేర్కొన్నారు.
