చాన్నాళ్ల తర్వాత అనుష్క(Anushka) నటిస్తున్న సినిమా మిస్‌ శెట్టి..మిస్టర్‌ పోలిశెట్టి(Miss shetty Mr Polishetty).. ఇందులో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోగా నటిస్తున్నారు. పి.మహేశ్‌బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

చాన్నాళ్ల తర్వాత అనుష్క(Anushka) నటిస్తున్న సినిమా మిస్‌ శెట్టి..మిస్టర్‌ పోలిశెట్టి(Miss shetty Mr Polishetty).. ఇందులో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోగా నటిస్తున్నారు. పి.మహేశ్‌బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు చిత్ర నిర్మాతలు. ఇప్పుడది యూ ట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. లేటెస్ట్‌గా నవీన్‌ పొలిశెట్టి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

అనుష్క వంటి స్టార్‌ హీరోయిన్‌ పక్కన నటించడం అంటే మొదట చాలా భయమేసిందన్నారు. షూటింగ్‌ ఆరంభంలో ఆమెతో కలిసి నటించడం అంత సులభం కాదని నవీన్‌ అన్నారు. షూటింగ్‌ ప్రారంభంలో మొదటి రెండు రోజులు కాస్త ఇబ్బంది పడ్డానని, ఆ తర్వాత నుంచి అనుష్క అందించిన ఎంకరేజ్‌మెంట్‌తో ఎలా బెరుకు లేకుండా అనుష్కతో కలిసిపోయానని నవీన్ తెలిపారు. తర్వాత షూటింగ్‌ అంతా చాలా సరదాగా సాగిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కారణంగా తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అయ్యామని అన్నారు.

సినిమాలో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పారు. అనుష్క వంటి స్టార్‌ హీరోయిన్‌తో కలిసి నటిస్తున్న సందర్భంలో చాలా నేర్చుకున్నానని తెలిపారు. అనుష్క నుంచి కౌగిలింతలు నేర్చుకున్నానని చెబుతూ సెట్స్‌లో అడుగుపెట్టగానే టెక్నిషియన్లకు(Technicians) అనుష్క ఓ వెచ్చటి హగ్‌(Warm Hug) ఇస్తారని అన్నారు. కానీ అది ఎంతో అభిమానపూర్వకంగా మాత్రమే ఇచ్చే కౌగిలింత అని, ఆవిడ నుంచి తాను కూడా అలా హగ్‌ ఇవ్వడం నేర్చుకున్నానని, అది మనలో ఎంతో పాజిటివ్‌ను ఇస్తుందని, అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్‌లో ఇదొకటి అని నవీన్‌ తెలిపారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో అనుష్కను చాలా తక్కువగా చూపించారని, సినిమాలో ఆమె చేసిన రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుందని, అంతే కాకుండా ఏ నటుడితోనైనా ఫర్‌ఫెక్ట్‌గా సింక్‌ అవుతుందని నవీన్‌ పోలిశెట్టి తెలిపాడు.

Updated On 23 Aug 2023 12:58 AM GMT
Ehatv

Ehatv

Next Story