టాలీవుడ్ లో పక్కింటి కుర్రాడిలా ప్రతీ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయిన హీరో నాని.

టాలీవుడ్ లో పక్కింటి కుర్రాడిలా ప్రతీ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయిన హీరో నాని. అటు ఫ్యామిలీ ఆడియన్స ను అలరిస్తూనే.. ఇటు ప్రయోగాత్మక సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు న్యాచురల్ స్టార్. మోనాటనీ నుంచి బయటపడి దసరా లాంటి మాస్ పాత్రను అద్భుతంగా చేసి చూపించిన నాని.. ఈసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. హిట్ 2 కోసం బాడీని పెంచే పనిలో ఉన్నాడు. సీక్స్ ప్యాక్ చూంపించడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఆ విషయం పక్కన పెడితే.. నాని నటించిన సినిమా జపాన్ లో రిలీజ్ కాబోతోంది. అది కూడా ఇక్కడ యావరేజ్ గా నిలిచిన సినిమాను జపాన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు సరిపోదా శనివారం. న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ బాక్సాఫీస్ దగ్గర ఒ మోస్తరు హిట్‌గా నిలిచింది.

కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమా నాని స్వాభావానికి పెద్దగా సరిపోయేలా కనిపించలేదు. కాని ఆడియన్స్ ను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు, బీజీఎం కూడా ఆడియెన్స్‌ను అలరించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఏకంగా ఫారెన్ లో రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ప్రపంచ ప్రేమికులు దినోత్సవం అయిన ఫిబ్రవరి 14న ఈ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

మరి రిలీజ్ అయిన ఇన్ని నెలలకు జపాన్ లో రిలీజ్ చేయాలనే ఆలోచన మూవీ టీమ్ కు ఎందుకు వచ్చింది. వారి ప్లాన్ ఏంటో తెలియదు కాని.. ఈ సినిమా జపాన్‌లో ఎంతమేర ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒక రొటీన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కినా, టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ అంశాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఈ సినిమా మన దగ్గర సక్సెస్ అందుకుంది. ఈ సినిమా హిట్ అయితే.. నాని ఇప్పుడు యూనివర్సల్ ఆడియెన్స్‌కు మరింత దగ్గర అవుతాడటనంలో సందేహం లేదు.

ehatv

ehatv

Next Story