✕
నేచురల్ స్టార్ నాని చాలా డిఫెరెంట్ పాత్రను చేస్తున్న దసరా చిత్రం ఈ నెల 30వ తారీఖున తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలఅవుతున్న సందర్భంగా చాలా సందడి నెలకొంది. అందుకు కారణం నాని గెటప్, డైలాగులు, కథ జరిగే వాతావరణం ఇవన్నీ సినిమాకి చెప్పలేనంత క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి.

x
Nani Dasara Movie
-
- నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) చాలా డిఫెరెంట్ పాత్రను చేస్తున్న దసరా చిత్రం(Dasara Movie) ఈ నెల 30వ తారీఖున తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలఅవుతున్న సందర్భంగా చాలా సందడి నెలకొంది. అందుకు కారణం నాని గెటప్, డైలాగులు, కథ జరిగే వాతావరణం ఇవన్నీ సినిమాకి చెప్పలేనంత క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి. ట్రైలర్(Trailer), టీజర్(Teaser), ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో విశేషాలతో దసరా ఊహించని ఉత్కంఠను రేపుతోంది. ఎవరి ఊహాగానాలు వారివి. ఎవరి వ్యాఖ్యానాలు వారివి. నాని ఈ చిత్రంతో ఇండస్ట్రీ కొడతాడని కొందరు, నానిని ఈ గెటప్‌లో, అటువంటి మాస్ డైలాగుల(Mass Dialogues)తో ప్రేక్షకులు ఆమోదిస్తారా అని మరికొందరు...ఇలా ఎవరికి తోచిన కామెంట్స్ వారు గుప్పిస్తున్నారు. అయితే ఇందులో నాని ప్రయత్నం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
-
- తానిప్పటివరతానిప్పటివరకూ కూడా చేసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రం చేయాలన్న గట్టి సంకల్పంతోనే నాని(Nani) దసరా చిత్రాన్ని(Dasara Movie) ఒప్పుకున్నారన్నది మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దర్శకవిభాగం నుంచే వచ్చి, కథానాయకుడిగా విజయవంతమైన నానికి కథాకథనాల మీద పరిపూర్ణమైన పట్టు ఉంది. లైను నచ్చితే చాలు, కథకు సంబంధించిన పూర్తి బాధ్యతను నాని వహించి సినిమాని హిట్ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాడని ఆయా చిత్రాల యూనిట్‌వారు చెబుతుంటారు. అంత కమిటెడ్‌గా ఉండే హీరోగా నానికి మంచి పేరే ఉంది. కానీ, ఇంతవరకూ నాని చేసిన చిత్రాలన్నీ కూడా ఆడినా, ఆడకపోయినా కూడా నాని పెరఫారమెన్స్కి ఏమాత్రం ఢోకా లేకుండా నానికి ప్రతీ చిత్రం ప్లస్ అవుతూనే వచ్చింది. అదీ నాని టాలెంట్‌కి ప్రేక్షకులిచ్చిన కానుక. కూడా చేసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రం చేయాలన్న గట్టి సంకల్పంతోనే నాని(Nani) దసరా చిత్రాన్ని(Dasara Movie) ఒప్పుకున్నారన్నది మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దర్శకవిభాగం నుంచే వచ్చి, కథానాయకుడిగా విజయవంతమైన నానికి కథాకథనాల మీద పరిపూర్ణమైన పట్టు ఉంది. లైను నచ్చితే చాలు, కథకు సంబంధించిన పూర్తి బాధ్యతను నాని వహించి సినిమాని హిట్ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాడని ఆయా చిత్రాల యూనిట్‌వారు చెబుతుంటారు. అంత కమిటెడ్‌గా ఉండే హీరోగా నానికి మంచి పేరే ఉంది. కానీ, ఇంతవరకూ నాని చేసిన చిత్రాలన్నీ కూడా ఆడినా, ఆడకపోయినా కూడా నాని పెరఫారమెన్స్కి ఏమాత్రం ఢోకా లేకుండా నానికి ప్రతీ చిత్రం ప్లస్ అవుతూనే వచ్చింది. అదీ నాని టాలెంట్‌కి ప్రేక్షకులిచ్చిన కానుక.
-
- దసరా చిత్రం(Dasara Movie)లో నాని బాగా రగ్గడ్(Rugged )గా, నాటుగా, క్వార్టర్ బాటిల్(Quarter Bottle) ఒక్క దెబ్బకి లేపేసి, పదిమందిని అవలీలగా చితక్కొట్టి నెక్స్ట్ లెవెల్(Next Level)లో కనిపిస్తున్నాడు నాని. దీనికి తోడు, బెహెన్చూత్ అనే మాట ఊతపదంగా వినిపిస్తోంది. ఈ ఊతపదాన్ని మొన్నీ మధ్య జరిగిన ప్రెస్మీట్లో దసరా చిత్రంలో నాని గ్యాంగ్‌లా కనిపించిన జబర్దస్ట్(Zabardast) కుర్రాళ్ళందరూ వల్లెవేయడంతో దసరా చిత్రం మాస్ దుమారాన్ని బాగానే లేపింది. అంటే మాస్ హిట్టే(Mass Hit) ధ్యేయంగా దసరా చిత్రాన్ని పూర్తిగా నాని వర్కవుట్ చేశాడన్నది తేటతెల్లమైంది. కానీ ఆ విజువల్స్‌లో నాని హైవోల్టేజ్ పెరఫారమెన్స్‌ని మాత్రం ఎవ్వరూ తప్పు బట్టలేరు. అంత కొత్తగా కనిపించాడు నాని. దీనికి తోడు, మహానటి చిత్రంతో క్లాసిక్ హీరోయిన్(Heroine)గా పేరుమోసిన కీర్తి సురేష్(Keerthy Suresh) కూడా అంతే మాస్‌గా కనిపించడం మరొక ఎత్తు.
-
- మహానటి చిత్రం(Mahanti Movie) తర్వాత దసరా చిత్రం(Dasara Movie) అంత పేరు తెస్తుందని కీర్తి(Keerthy) చెప్పడం కూడా ఇక్కడ గమనార్హం. దర్శకుడు శ్రీకాంత్ ఓడేల(Srikanth Odela)కిది తొలిచిత్రం. అయినా సరే నాని(Nani) దీక్షను నమ్మి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న చెరుకూరి సుధాకర్(Sudhakar Cherukuri) ఇంత భారీ చిత్రాన్నిభుజాలకెత్తుకున్నారు. అందరి ఆశయం ఒక్కటే. దసరా చిత్రాన్ని పెద్ద హిట్‌గా నిరూపించాలని. ఈ రోజున ప్రేక్షకులు సైతం ఎంత విభిన్నంగా ఉంటే అంతగా ఆదరిస్తున్నారన్న విషయం ఎన్నో సినిమాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని ఈసారి చేసిన ఈ బృహత్తర ప్రయత్నం తప్పకుండా విజయదుందుభిలు మ్రోగిస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే కథావాతావరణం, ఆ నాటుతనం వంటివి ఖచ్చితంగా మాస్ ప్రేక్షకలను రెచ్చగొట్టడం మాత్రం ఖాయం.
-
- దానికి తోడు ఇంతకు ముందు వచ్చి, జాతీయస్థాయి(National level)లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప చిత్రంలా దాదాపుగా కనిపించడం, కెజిఎఫ్ చిత్రం(KGF Movie) వాతావరణం...ఇటువంటి రెండుమూడు అంశాలు దసరా(Dasara) చిత్రానకి కలిసొచ్చే విషయాలుగా అందరూ భావిస్తున్నారు. అన్నీ కలిసొస్తే మాత్రం దసరా చిత్రం రికార్డులు బ్రేక్ చెయ్యడం ఏమంత కష్టం కాదు. చెరుకూరి సుధాకర్(Sudhakar Cherukuri) నిర్మాతగా కాలర్ ఎగరేసే రోజు పెద్ద దూరం లేదు.

Ehatv
Next Story