సంతోష్ శోభన్(Santhosh Shobhan) హీరోగా మాళవికా నాయర్(Malavika nair) జంటగా నటించిన సినిమా అన్ని మంచిశకునములే. కుటుంబ కథతో తెరకెక్కిన ఈమూవీ నందినీ రెడ్డి డైరెక్ట్ చేయగా.. వైజయంతీ మూవీస్(Vyjayanthi movies) పతాకంపై స్వప్త, ప్రియాంకలు నిర్మించారు. మిక్కేజే మేయర్ సంగీతం అందించగా.. ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి నేచురల్ స్టార్ నానీ, మలయాళ హ్యాండ్సమ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు.

Natural Star Nani
నేచురల్ స్టార్ నానీ(Natural star nani) ఫన్నీ కామెంట్స్ చేశారు. అన్ని మంచి శకునములే సినిమా(Ani manchi shakunamule) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన నందినీ రెడ్డి(Nandhini Reddy)పై కాస్త కామెడీతో కూడిన కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
సంతోష్ శోభన్(Santhosh Shobhan) హీరోగా మాళవికా నాయర్(Malavika nair) జంటగా నటించిన సినిమా అన్ని మంచిశకునములే. కుటుంబ కథతో తెరకెక్కిన ఈమూవీ నందినీ రెడ్డి డైరెక్ట్ చేయగా.. వైజయంతీ మూవీస్(Vyjayanthi movies) పతాకంపై స్వప్త, ప్రియాంకలు నిర్మించారు. మిక్కేజే మేయర్ సంగీతం అందించగా.. ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి నేచురల్ స్టార్ నానీ, మలయాళ హ్యాండ్సమ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు.
ఇక ఈ సందర్భంగా.. వేదికపై నాని మాట్లాడుతూ .. ఈ సినిమా ఈవెంట్ కు నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు కాని.. నేను అసలు గెస్ట్ ను కాదు.. నిజానికి నేను ఆ ఫ్యామిలీకి చెందినవాడినే. నా సినిమా అలా మొదలైంది తోనే నందినీ రెడ్డిగారి కెరియర్ మొదలైంది. అప్పటికీ, ఇప్పటికీ ఆమె ఎంతో ఎదిగిపోయారు. ఈ సినిమా విషయంలో ఆమెలోని మెచ్యూరిటీ లెవెల్స్ మరింత బలంగా కనిపిస్తున్నాయి అని అన్నారు. ఆమె సినిమా చేశారు అంటే.. హిట్ ప్లాప్ సంగతి పక్కన పెడితే..అది మంచి సినిమా అయ్యి ఉంటుంది అన్నారు నాని.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. కథ పరంగా .. విజువల్స్ పరంగా .. సాంగ్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఒక లడ్డు తిన్నట్టుగా ఉంటుంది. ఫ్యామిలీ స్టోరీ కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇక హీరోయిన్ మాళవిక నాయర్ నాకు ఎవడే సుబ్రమణ్యం దగ్గర నుంచి తెలుసు. తను గొప్ప ఆర్టిస్ట్ .. అది అందరికి బాగా తెలుసు. హీరో సంతోష్ శోభన్ కి.. నటనలో మంచి ఈజ్ .. టైమింగ్ ఉన్నాయి. అతణ్ణి చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తోంది అన్నారు.
ఇక ఈరకంగా చూసుకుంటే నందినీ రెడ్డి గారికి సంతోష్ రూపంలో మరో నాని దొరికాడు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అందరికి గుర్తుండిపోతుంది.. సూపర్ హిట్ అవుతుంది అంటూ నాని మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో నిర్మాతలతోపాటు ప్రాజెక్ట్ కే డైరెక్టర్ నాగ అశ్వీన్, హనూరాఘవపూడి కూడా పాల్గోన్నారు.