✕
Dasara OTT Release Date : ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన నాని దసరా మూవీ, స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..?
By EhatvPublished on 20 April 2023 2:33 AM GMT
థియేటర్లలో హడావిడి అయిపోవచ్చింది. ఇక బుల్లితెరపై ప్రతాపం చూపించడానికి రెడీ అవుతుంది నేచురల్ స్టార్ నాని దసరా సినిమా.ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. మరి ఎప్పుడు..? ఎందులో రిలీజ్ కాబోతోంది.

x
Dasara OTT Release Date
-
- థియేటర్లలో హడావిడి అయిపోవచ్చింది. ఇక బుల్లితెరపై ప్రతాపం చూపించడానికి రెడీ అవుతుంది నేచురల్ స్టార్ నాని దసరా సినిమా.ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. మరి ఎప్పుడు..? ఎందులో రిలీజ్ కాబోతోంది.
-
- బుల్లితెరపై దసరా పండగ చేయబోతోంది నేచురల్ స్టార్ నాని నటించిన ఊరమాస్ మూవీ దసరా. థియేటర్లను అల్లాడించినఈమూవీ డిజిటల్ స్క్రీన్ లను దడదడలాడించేందుకు డేట్ ను లాక్ చేసుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఒదేల దర్శకుడిగా డెబ్యూ ఇస్తూ.. తెరకెక్కించిన ఈసినిమా.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. శ్రీకాంత్ ఫస్ట్ సినిమా అయినా.. సీనియారిటీ ఉన్న దర్శకుడి మాదిరిగా ఉంది ఆయన టేకింగ్. ఈ విషయంలో నాని కూడా ముందు నుంచే హింట్ ఇచ్చాడు శ్రీకాంత్ వర్క్ స్టైల్ బాగుంది అని. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ పై కలెక్షన్ల వర్షం కురిపించింది సినిమా.
-
- నాని ఊర మాస్ లుక్ లో..అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చిన ఈసినిమాలో.. అంతకు మించి అన్నట్టుగా.. నేచురల్ స్టార్ కు పోటీ ఇస్తూ నటించింది కీర్తి సురేష్. అచ్చమైన పల్లెటూరి నాటు పిల్లగా కీర్తి నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దాంతో ప్రేక్షకులకు ఈసినిమా పిచ్చిగా నచ్చేసింది. ఇక ఈసినిమాలో ఇటునాని,అటు కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్లారు. అక్కడ కూడా తమ సత్తా చాటుకున్నారు. హిందీ ఆడియన్స్ మనసు దోచుకున్నారు దసరా టీమ్.
-
- ఇక థియేటర్లలో దుమ్ము రేపే కార్య క్రమంలో అయిపోయింది. ఇక ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది దసరా సినిమా. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ లో దసరా డిజిటల్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అది కూడా ఈనెలలోనే ఈనెల 27న సినిమా బుల్లితెర రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో వార్త హైలెట్ అవుతోంది. అంతే కాదు ఈసినిమా కోసం నెట్ ప్లిక్స్ ఏకంగా 22 కోట్లతో డీల్ కూడా కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే దసరా హిందీ వెర్షన్ మూవీ మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.
-
- ఇక దసరా సినిమా సాధారణ ఆడియన్స్ నుంచి.. స్టార్ సెలబ్రిటీల వరకూ అందరిని ఆకర్షించింది. నాని, కీర్తి సురేష్ పెర్పామెన్స్ కు ఫిదా అయ్యారు స్టార్స్. చిరంజీవి ప్రత్యేకంగా ట్విట్టర్ లో ఓ నోట్ రాశారు. మహేష్ బాబు కూడా సినిమా చూడంగానే వెంటనే టీమ్ ను అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. అటు ఇది అద్భుతమైన సినిమా అంటూ ప్రభాస్ కూడా మెచ్చుకున్నారు. వెరీ రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ ఈసినిమాను నిర్మించగా.. సంతోష్ నారాయణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

Ehatv
Next Story