✕
Dasara Movie Success Celebrations in 5th April : రేపే సంచలన చిత్రం దసరా విజయోత్సవ వేడుకలు..
By EhatvPublished on 4 April 2023 1:58 AM GMT
రికార్డు స్థాయిలో కలెక్షన్ల పెను తుఫానుని సృష్టించి, వంద కోట్ల క్లబ్వైపుగా దూసుకెళ్తున్న నేచరల్ స్టార్ నాని స్టారర్ దసరా చిత్రం విజయోత్సవ వేడుకలు రేపు అంటే 5వ తేరీన కరీంనగర్, జగిత్యాల దగ్గర అత్యంత ఘనంగా జరుగుబోతున్నాయి. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదలై, విడుదలైన అన్ని చోట్లా సంచలన విజయం సాధించి, నాని కెరీర్లోనే కలికితురాయిగా దసరా చిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది.

x
Dasara Movie Success Celebrations
-
- రికార్డు స్థాయిలో కలెక్షన్ల పెను తుఫానుని సృష్టించి, వంద కోట్ల క్లబ్వైపుగా దూసుకెళ్తున్న నేచరల్ స్టార్ నాని స్టారర్ దసరా చిత్రం విజయోత్సవ వేడుకలు రేపు అంటే 5వ తేరీన కరీంనగర్, జగిత్యాల దగ్గర అత్యంత ఘనంగా జరుగుబోతున్నాయి. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదలై, విడుదలైన అన్ని చోట్లా సంచలన విజయం సాధించి, నాని కెరీర్లోనే కలికితురాయిగా దసరా చిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. విడుదలైన రోజే తిరుగులేని రిపోర్డును సాధించి, అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే రేంజ్లో దసరా సూపర్ డూపర్ హిట్టయింది. తొలిచిత్రమే అయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అసమానమైన ప్రతిభాపాటవాలతో, స్వయంగా రాసుకున్న కథను అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించి అందరినీ స్టన్ చేశాడు.
-
- శ్రీకాంత్ చెప్పిన కథను విశ్వసించి, ఏ ఒక్క మార్పు లేకుండా ఏజ్టీజ్గా ఆ కథని తెరకెక్కించడానికి దర్శకుడు శ్రీకాంత్ అన్ని విధాల సహకరించి, అపురూపమైన విఉయాన్ని అందుకున్న నానిని అగ్రకథానాయకులు ప్రిన్స్ మహేష్ బాబు, ఇండియన్ బాహుబలి ప్రభాస్, ఉన్నతశ్రేణి దర్శకుడు సుకుమార్ తమ ట్విట్టర్ హేండిల్ నుంచి అభినందనలు తెలయజేసి దసరా చిత్రం సాధించిన ఘన విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం దసరా అపూర్వ విజయానికి మరింత వన్నె తెచ్చింది. నిన్ననే మీడియాతో దసరా సక్సెస్ సంతోషాన్ని పంచుకోవడానికి ప్రత్యేకంగా కలిసిన నేచురల్ స్టార్ నాని తనకొస్తున్న మెసేజ్‌లు, ప్రశంసల గురించి ప్రస్తావిస్తూ, ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఎంజాయ్ చేశాడు. కాగా, కలెక్షన్ పిగర్స్ చూస్తుంటే అంరదికీ కళ్లు తిరుగుతున్నాయి. రోజురోజుకీ అడ్డూఆపూ లేకుండా పెరిగిపోతున్న కలెక్షన్ల సునామీతో అతి తక్కువ రోజుల్లో దసరా చిత్రం వంద కోట్ల క్లబ్‌కి చేరిపోయేందుకు ఉరకలు వేస్తోంది.
-
- విడుదలకు ముందు ఎన్నో వ్యాఖ్యానాలు, విమర్శలు....నాని ఏంటా గెటప్....జెంటిల్ మేన్‌లా, ఓ సామాన్యమైన కుర్రాడిలా కనిపించే నాని ఇలాంటి రగ్గ్డ్ గెటప్‌లో ఎవడు చూస్తాడులే అని, ఇదేదో పుష్ప చిత్రానికి ఇమిటేషన్లా ఉందని, కెజిఎఫ్లా ఉంది వాతావరణం అని ట్రెలర్స్, టీజర్స్ చూసి తెగ పేలినవారందరి నోళ్ళకు దసరా చిత్రంలోనాని చేసిన పెరఫారమెన్స్తాళం వేసింది. అందరితో పాటు వాళ్ళు కూడా నానిని, దర్శకుడు శ్రీకాంత్‌ని, ముఖ్యంగా దసరా చిత్రంలో నాని ఫ్రెండ్‌గా నటించిన తెలుగులో కొత్తగా ప్రవేశించిన దీక్షిత్ శెట్టిని, హీరోయిన్ కీర్తి సురేష్‌ని తెగ పొగుడుతున్నారు, గత్యంతరం లేక.
-
- సంతోష్ నారాయణ మథ్యలో పేచీ పెట్టాడు దసరా వర్క్ జరుగుతున్న్ టైంలో దొర్లిన ఓ సంఘటన గురించి కూడా నాని చాలా అసక్తికరంగా చెప్పారు. దసరా చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన సంతోష్ నారాయణకి దసరా చిత్రంలో సూరి పాత్ర హత్యకు గురైన తర్వాత, వెన్నెల పాత్రను ధరణి పాత్ర హఠాత్తుగా తాళి కట్టడం పట్ల సంతోష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు నాని వివరించారు. సినిమా ద్వారా ఏం నీతిని మనం చెబుతున్నాం నాకిష్టం లేదు, రీరికార్డింగ్ చెయ్యనని మొరాయించారని నాని చెప్పారు. తర్వాత సీనులో ధరణి పాత్ర వెన్నెలతో మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితుడిగా వెన్నెలకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేకపోయానని, ఆవేశం ఆపుకోలేక తాళి కట్టానని ధరణి పాత్ర చెప్పిన మాటలు విని అప్పుడు సంతోష్ సంతోషించి, అందులో ఉన్న ఔన్నత్యాన్ని మెచ్చుకుంటూ రీరికార్డింగ్ని కొనసాగించారని నాని ఆ సంఘటనని నెమరువేసుకున్నారు. అలాగే కీర్తి సురేష్‌కి కథ చెప్పమని దర్శకుడు శ్రీకాంత్‌ని పంపినప్పుడు ఆమె కథ విని తనకి నచ్చలేదు, చెయ్యనని చెబితే బావుణ్ణని శ్రీకాంత్ ఫీలయ్యాడని కూడ నాని చెప్పారు. ‘’ శ్రీకాంత్‌కి ఏ కోశాన కీర్తి సురేష్‌ని హీరోయిన్గా పెట్టడం ఇష్టం లేదు. కథ విని నాకు నచ్చలేదని చెబితే చాలు అనుకున్నాడు. కీర్తి కథ బావుంది అని చెప్పగానే శ్రీకాంత్‌కి షాక్. మళ్ళా కూడా లావు అవమంటే లావు కాలేదు అని కీర్తి మీద కంప్లైంట్ చెబుతుండేవాడు శ్రీకాంత్. ఇప్పుడు సినిమా రిలీజై ఇంత విజయం సాధించాక వెన్నెల పాత్రలో కీర్తి సురేష్‌ని తప్పితే మరెవ్వరినీ ఊహించుకోలేకపోతున్నానని అంటున్నాడు.” అని నాని చెప్పడం చాలా అసక్తిగా అనిపించింది... " Written By : Nagendra Kumar "

Ehatv
Next Story