నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ తో దసరా మూవీ చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్నారు. కొత్త దర్శకుడైనా కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే నాని అంతకుముందు డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ’అంటే సుందరానికి‘ సినిమా చేశారు. ఈ సినిమా జనాలకు ఎందుకో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు... అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. మంచి అంచనాలతో […]

నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ తో దసరా మూవీ చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్నారు. కొత్త దర్శకుడైనా కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే నాని అంతకుముందు డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ’అంటే సుందరానికి‘ సినిమా చేశారు. ఈ సినిమా జనాలకు ఎందుకో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు... అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.

మంచి అంచనాలతో వచ్చినా ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ‘మెంటల్ మదిలో’, ’బ్రోచేవారెవరురా‘ సినిమాలతో ఆకట్టుకున్న వివేక్ కు ‘అంటే సుందరానికి’ సినిమాతో ఫ్లాప్ పడింది. ఆ తర్వాత నానికి మరో మంచి కథ రెడీ చేసి నేరెట్ చేశాడట వివేక్ ఆత్రేయ. ఆ కథ నానికి నచ్చడంతో ఓకే చెప్పి మరోసారి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ గురించి త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందంటున్నాయి సినీ వర్గాలు

అయితే ఇక నాని ‘దసరా’ మూవీ విషయానికి వస్తే... సినిమాపై నాని ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. తనకు నటుడిగా మంచి పేరు తెస్తుందని, కమర్షియల్ గా కూడా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నాడు. సినిమాను హిందీలో డైరెక్ట్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ’దసరా‘లో నాని ధరణి పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ వెన్నెల క్యారెక్టర్ చేస్తోంది.

టీజర్ తో దుమ్ములేపిన ‘దసరా’కు ఓ రేంజ్ లోనే బిజినెస్ జరుగుతోందట. తెలుగు రాష్ట్రాల రైట్స్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 28 కోట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో రూ. 40 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా హిట్ టాక్ వస్తే మటుకు.. నాని కెరీర్ లో ది బిగ్గెస్ట్ హిట్ గా ’దసర‘ నిలిచిపోతుంది.

ఈ సినిమా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాపై బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ సంతోష్ నారాయణణ్, సినిమాటోగ్రఫీ సత్యాన్ సూర్యన్ అందిస్తున్నారు. 2023 మార్చి 30న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Updated On 13 Feb 2023 2:54 AM GMT
Ehatv

Ehatv

Next Story