నాచురల్ స్టార్ నాని(Natural Star Nani) , సీతారాం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు శౌర్యుప్ దర్శకత్వం వహిస్తున్నాడు. చెరుకూరి మోహన్, తీగల విజయేందర్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్(Shruti Haasan) ఒక ఇంపార్టెంట్ రోల్‌ను పోషిస్తున్నారు.

Nani 30 Next Schedule
నాచురల్ స్టార్ నాని(Natural Star Nani) , సీతారాం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు శౌర్యుప్ దర్శకత్వం వహిస్తున్నాడు. చెరుకూరి మోహన్, తీగల విజయేందర్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్(Shruti Haasan) ఒక ఇంపార్టెంట్ రోల్‌ను పోషిస్తున్నారు. మొదట గోవాలో ఓ లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఈ మధ్యనే ముంబాయిలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు ఓ చిన్న వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియోలో నాని తన ముఖాన్ని హుడీతో కప్పుకుని సముద్రపు ఒడ్డున నడుస్తూ కనిపించాడు. తాజాగా కొత్త షెడ్యూల్ కోసం కూనూర్‌కు వెళ్లనున్నట్టు వీడియోలో స్పష్టత ఇచ్చారు. ఇక్కడి లొకేషన్స్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇది నానికి 30(Nani30)వ సినిమా. వినూత్నమైన కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధాలకు ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంగీతాన్ని హేషమ్ అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab) అందిస్తున్నాడు.
