ఆస్ట్రేలియా క్రికెట్‌ ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌కు(David warner) తెలుగునాట చాలా మంది అభిమానులున్నారు.

ఆస్ట్రేలియా క్రికెట్‌ ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌కు(David warner) తెలుగునాట చాలా మంది అభిమానులున్నారు. ఆయన ఐపీఎల్‌లో(IPL) హైదరాబాద్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు మరింత దగ్గరయ్యారు. ఎంత గొప్ప ఆటగాడో అంత గొప్పగా రీల్స్‌ కూడా చేస్తారు. సినిమాల్లోని ఫేమస్ క్యారెక్టర్లకు తన ముఖాన్ని జోడించి రీల్స్ చేస్తూ చాలా పాపులరయ్యారు. టిక్ టాక్ లో మన తెలుగు పాటలకు వీడియోస్ చేస్తూ ట్రెండ్ అయ్యారు. ముఖ్యంగా 2021లో వచ్చిన పుష్ప(Pushpa) సినిమాలోని పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే.. అనే వీడియో చేసిన డేవిడ్‌ వార్నర్‌ బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత వార్నర్‌, అల్లు అర్జున్‌(allu arjun) మధ్య బాండింగ్‌ ఏర్పడింది. బన్నీ పుట్టిన రోజున వార్నర్‌ విష్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ డేవిడ్‌ వార్నర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వార్నర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు అల్లు అర్జున్‌. "నా సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని తన ఎక్స్ ద్వారా మెసేజ్‌ పంపారు.

Eha Tv

Eha Tv

Next Story