నేషనల్ క్రష్(National crush) రష్మిక మందన్నా(Rashmika Mandanna) గురించి తెలియని సినీ అభిమాని ఉండరు.
నేషనల్ క్రష్(National crush) రష్మిక మందన్నా(Rashmika Mandanna) గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఆమె ఇప్పుడు జాతీయస్థాయి నటి! యానిమల్(animal) సినిమాతో బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు రేపిన ఈ కన్నడ భామ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలలో పుష్ప ది రూల్‌తో (Pushpa the Rule)పాటు, బాలీవుడ్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఛావాలో(Chava) కూడా నటిస్తోంది. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇందులో విక్కీ కౌశల్(Vickey Kaushal) ఛత్రపతి శివాజీ మమరాజ్ పాత్రను పోషిస్తున్నాడు. శివాజీ సతీమణి ఏసుబాయిగా రష్మిక నటిస్తోంది. పేరుకు బాలీవుడ్ సినిమానే కానీ ఎక్కువ భాగం మరాఠి(Marati) భాషలోనే ఉంటుంది. అందుకే రష్మిక మందన్నా మరాఠి భాష నేర్చుకుంటోంది. కావాలంటే డబ్బింగ్ చెప్పించుకోవచ్చు. అలా అయిదే రష్మిక ఎందుకవుతుంది? ఏసుబాయ్ పాత్రకు న్యాయం చేయాలంటే సొంత గొంతు అయితే బాగుంటుందని రష్మిక భావించింది. అందుకే మరాఠి పాఠాలు నేర్చుకుంటోంది. కన్నడ మాతృభాష అయినప్పటికీ తెలుగు కూడా చక్కగా మాట్లాడుతుంది రష్మిక. పట్టుదలతో తెలుగు నేర్చుకుంది. అలాగే ఇప్పుడు మరాఠి కూడా! అందుకే రష్మికకు అభిమానులు ఎక్కువ! ప్రస్తుతం పుష్ప ది రూల్, ఛావాతో పాటుగా ది గర్ల్‌ఫ్రెండ్, కుబేర, యానిమల్ 2 సినిమాలలో రష్మిక నటిస్తోంది.