ఎమర్జెన్సీని వాయిదా వేసిన సెన్సార్ బోర్డు
దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ(Indira gandhi) రాజకీయ జీవితం ఆధారంగా వివాదాస్పద నటి, ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్(Kangana ranauth) ఎమర్జెన్సీ పేరుతో ఓ సినిమా తీశారు. ఇందిరాగాంధీ పాత్రను పోషిస్తూ దర్శకత్వం కూడా వహించారు. ఎమర్జెన్సీ(Emrgency) సమయంలోని పరిస్థితులను ఇందులో చూపిస్తారన్నమాట! సినిమాను ఆమె ఏ ఉద్దేశంతో తీశారో అప్రస్తుతం కానీ సినిమా మాత్రం వాయిదా మీద వాయిదా పడుతూ వస్తున్నది. ఇప్పుడు సినిమా విడుదలను వాయిదా వేయాలని కేంద్ర సెన్సార్ బోర్డే(National censor Board) ఆదేశించడం గమనార్హం. ఈ సినిమా ఈ నెల 6వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమాలో ఓ వర్గం మనోభావాలను కించపరిచారని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో మతపరంగా సున్నితమైన అంశాలు ఇందులో ఉన్నాయని సెన్సార్ బోర్డ్ చిత్రాన్ని వాయిదా వేసింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీ కేంద్ర సెన్సార్ బోర్డ్‌కు లేఖ రాసింది. ఈ సినిమా ట్రైలర్‌లో తమ వర్గంపై అనుమానం రేకెత్తించేలా సున్నితమైన అంశాలను ప్రస్తావించారని, అబద్దాలు చూపించారని గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ఆరోపించింది. అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. మరోవైపు ఈ సినిమాపై నిషేధం విధించాలని దేశవ్యాప్తంగా పలు సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో కూడా సినిమాను నిషేధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.