చందుసాయి(Chandu Sai)..పక్కింటి కుర్రాడుగా చాలా పాపులర్. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్(Youtube Short film) తోపాటు ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించాడు. తాజాగా ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడంటూ నార్సింగ్(Narsingh) పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. శుక్రవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో యూట్యూబర్ చందుసాయిపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు.అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సాయిచందు అంటే..సోషల్ మీడియాలో(Social media) ముఖ్యంగా యూట్యూబ్ చూసేవారికి సుపరిచితుడే. అయితే ఓ యువతీ ఫిర్యాదు చేసిన అత్యాచారం ఆరోపణలపై చందుసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన యువతితో యూట్యూబర్ చందుసాయికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 2021 ఏప్రిల్ 25న బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి ఆమెపై అత్యాచారం(Molestation) చేశాడన్నది బాధితురాలి ఆరోపణ. అయితే పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడట. దీంతో అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన సదరు యువతి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. చందుపై అత్యాచారం, మోసం కింద అరెస్ట్ చేసి..విచారణ జరుపుతున్నారు.
ఇక చందు అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్. యూట్యూబ్‌లో చందుగాడు పేరుతో ఫేమస్ అయ్యాడు. కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేశాడు. ఇప్పటికే ఆతడు చాలా షార్ట్ ఫిలిమ్స్‌లో కనిపించి మెప్పించాడు. అతడు చేసే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. అయితే కొంత కాలంగా ఎందుకనో అతడు షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించడం లేదు. తాజాగా..ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో వార్తల్లోకెక్కారు. అయితే.. మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పక్కింటి కుర్రాడిపై వచ్చిన ఆరోపణలు నిజమో..కాదో తెలియాల్సి ఉంది.