నరేశ్(Naresh)-పవిత్ర లోకేశ్(Pavitra Lokesh) జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిజానికి రేపు సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే మళ్లీ పెళ్లి సినిమా తన పరువు ప్రతిష్టలను కించపరిచేలా ఉందంటూ నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi) కోర్టుకు వెళ్లారు. కూకట్‌పల్లి(Kukatpally) ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Ramya Raghupathi
నరేశ్(Naresh)-పవిత్ర లోకేశ్(Pavitra Lokesh) జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిజానికి రేపు సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే మళ్లీ పెళ్లి సినిమా తన పరువు ప్రతిష్టలను కించపరిచేలా ఉందంటూ నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi) కోర్టుకు వెళ్లారు. కూకట్‌పల్లి(Kukatpally) ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మళ్లీ పెళ్లి సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పిటిషన్‌లో రమ్య రఘుపతి కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్‌ఎస్‌రాజు దర్శకత్వం వహించిన మళ్లీపెళ్లి సెన్సార్ పూర్తి చేసుకుని శుక్రవారం విడుదలకు సిద్ధమయ్యింది. సీనియర్ నటుడు నరేశ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సినిమా ప్రమోషన్లు కూడా అదరకొట్టే రీతిలో జరిపారు. నటుడు శరత్‌బాబుకు ఇది చివరి సినిమా.
