మొట్ట మొదటి సారి తన తండ్రి గురించి.. తన తండ్రి సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్(Pavitra Lokesh) గురించి స్పందించాడు నరేష్ తనయుడు నవీన్(Naveen). ఆయన ఏమన్నాడంటే..?

Naveen Comments On Pavitra Lokesh
మొట్ట మొదటి సారి తన తండ్రి గురించి.. తన తండ్రి సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్(Pavitra Lokesh) గురించి స్పందించాడు నరేష్ తనయుడు నవీన్(Naveen). ఆయన ఏమన్నాడంటే..?
ఆమద్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. సీనియర్ నటుడు నరేశ్(naresh) తనయుడు నవీన్ విజయ్ కృష్ణ(Naveen Vijay Krishna), చాలా కాలం క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. కాని ఆతరువాత కెరీర్ ను కంటీన్యూ చేయలేదు. 'నందినీ నర్సింగ్ హోమ్'(Nandini Nursing Home) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయనకి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాడు. ప్రేక్షకుల ఆదరణ కూడా లభించలేదు. ఒక వైపున నటుడిగా కొనసాగుతూనే, మరో వైపున దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నరేశ్ - పవిత్ర లోకేశ్ పెళ్లి గురించి ప్రస్తావించారు. మా నాన్నగారు పవిత్ర లోకేశ్ ను వివాహం చేసుకున్నారు. ఈ విషయంలో ఆయనను ఎంతో మంది విమర్శించారు. ఒక కొడుకుగా నేను మాత్రం ఆయన హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను" అన్నారు.
"ఏం చేయాలనేది నాన్నగారికి తెలుసు .. మన మనసుకి నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే కరెక్టు అనేది నా అభిప్రాయం కూడా. కామెంట్స్ కాలంలో చాలామంది ఉంటూనే ఉంటారు. వాళ్లందరికీ సంతృప్తి కలిగేలా బ్రతకడం కష్టం. పవిత్ర లోకేశ్ గారి విషయానికొస్తే ఆమె చాలా కాలంగా నాకు తెలుసు. ఆమె చాలా సైలెంట్ .. అదే సమయంలో అంతే స్ట్రాంగ్ గా కూడా ఉంటారు. అలాంటివారు చాలా తక్కువ మంది ఉంటారు" అని చెప్పుకొచ్చారు.
