తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్.. టీజర్ చూసినవారికి ఈ సినిమా కథ అంతా నరేష్ నిజజీవితం ఆధారంగా తీసిన సినిమా అని అర్థమైపోతుంది. నరేష్ మూడు పెళ్లిళ్లు, రమ్య రఘుపతితో గొడవలు, పవిత్రతో ప్రేమయం ఈ విషయాలన్నింటిని టీజర్లో చూపించారు.

Naresh Pavitra Lokesh malli pelli trailer out movie release on this date
సీనియర్ నటుడు నరేష్ (Naresh).. పవిత్రా లోకేష్ (Pavitra Lokesh ) గురించి పర్యేకంగా చెప్పనవసరం లేదు.. గత సంవత్సరం నుంచి సోషల్ మీడియాలో వీళ్లిద్దరు ట్రెండింగ్.. వీరిద్దరి ప్రేమాయణం.. పెళ్లి గురించి ఫిల్మ్ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. అయితే వీరిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి (Pavitra Lokesh) అనే సినిమాలో నటిస్తున్నారు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్.. టీజర్ చూసినవారికి ఈ సినిమా కథ అంతా నరేష్ నిజజీవితం ఆధారంగా తీసిన సినిమా అని అర్థమైపోతుంది. నరేష్ మూడు పెళ్లిళ్లు, రమ్య రఘుపతితో గొడవలు, పవిత్రతో ప్రేమయం ఈ విషయాలన్నింటిని టీజర్లో చూపించారు.
మళ్లీ పెళ్లి టీజర్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపించారు నరేష్. విజయనిర్మల, కృష్ణ మధ్య అనుబంధం, కృష్ణతో నరేష్ కి సంబందించిన విషయాలు కూడా సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తన సినిమాలో కృష్ణ కుటుంబానికి సంబందించిన విషయాలు చూపించడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు. ఒకవేళ ఇందులో కృష్ణ గురించి ఏమైనా నెగిటివ్‌గా కనిపిస్తే మాత్రం.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ నరేష్‌ని వదలరనే చెప్పాలి.
