సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మళ్లీ పెళ్లి(Malli Pelli).. నరేశ్(Naresh), పవిత్ర లోకేశ్(Pavitra Lokesh)లతో ఎం.ఎస్.రాజు రూపొందించిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా గురించి పవిత్ర లోకేశ్ చాలా గొప్పగా చెప్పారు. సమాజానికి అద్దం పట్టే కథతో ఈ సినిమాను రూపొందించామన్నారు.

Naresh – Pavitra Lokesh
సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మళ్లీ పెళ్లి(Malli Pelli).. నరేశ్(Naresh), పవిత్ర లోకేశ్(Pavitra Lokesh)లతో ఎం.ఎస్.రాజు రూపొందించిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా గురించి పవిత్ర లోకేశ్ చాలా గొప్పగా చెప్పారు. సమాజానికి అద్దం పట్టే కథతో ఈ సినిమాను రూపొందించామన్నారు. ఇదిడఒకరిని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కాదన్నారు పవిత్ర. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నరేశ్, పవిత్రలు ఈ సినిమా చేయడం, వీరి జీవితాలలో జరిగిన సంఘటనలు టీజర్‌లో కనిపించడంతో ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. హీరోయిన్‌గా నటించడం తనకు కొత్తేమీ కాదని, కెరీర్ మొదట్లో హీరోయిన్‌గా నటించానని పవిత్ర అన్నారు. ఆ తర్వాత కూడా తనకు నచ్చిన పాత్రలనే చేస్తూ వచ్చానని చెప్పారు. ఇన్నాళ్త తర్వాత ఓ ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించిందని పవిత్ర తెలిపారు. తనను, నరేశ్‌ను దృష్టిలో పెట్టుకునే ఎం.ఎస్.రాజు ఈ కథను సిద్ధం చేశారని, మీరిద్దరు కలిసి నటిస్తే బాగుంటుందని తమతో చెప్పారని పవిత్ర అన్నారు. 'ఇది కల్పిత కథా, యథార్థ కథా అనేది చెప్పలేను. చాలా మంది నాదీ, నరేశ్ జీవితాలకి సంబంధించిన కథ అనుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు. సినిమా చూశాక ప్రేక్షకులకే ఓ క్లారిటీ వస్తుంది. బలమైన భావోద్వేగాలతో సినిమా రూపుదిద్దుకుంది' అని పవిత్ర చెప్పుకొచ్చారు...
