టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ ( Naresh V.K), డైరెక్టర్ MS రాజు (M.S.Raju) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మళ్లీ పెళ్లి' (Malli Pelli). ఈ చిత్రం వేసవి కానుకగా విడుదలకు సిద్దమైంది. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేష్ ప్రొడ్యూసర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కన్నడలోనూ 'మత్తే మధువే' పేరుతో విడుదల కానుంది. తన భర్త నరేష్ అసలు క్యారెక్టర్ గురించి వనిత విజయకుమార్ బ్రీఫింగ్‌తో టీజర్ ఆసక్తికరంగా మొదలవుతుంది.

Malli Pelli Teaser 2023
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ ( Naresh V.K), డైరెక్టర్ MS రాజు (M.S.Raju) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మళ్లీ పెళ్లి' (Malli Pelli). ఈ చిత్రం వేసవి కానుకగా విడుదలకు సిద్దమైంది. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేష్ ప్రొడ్యూసర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కన్నడలోనూ 'మత్తే మధువే' పేరుతో విడుదల కానుంది. తన భర్త నరేష్ అసలు క్యారెక్టర్ గురించి వనిత విజయకుమార్ బ్రీఫింగ్‌తో టీజర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆయన తనను మోసం చేశాడంతో ఆసక్తికరంగా సాగుతుంది.. పవిత్ర లోకేష్ (Pavithra Lokesh)తో ఆయన ప్రేమలో ఉండటంతో మొదటి భార్యపై మొఖం చాటేస్తాడు. అయితే టీజర్ లో పవిత్ర-నరేష్‌లు లిప్‌కిస్ (lipkiss) సీన్స్ ఉండటంతో లీజర్‌కు కాస్త బూస్టప్ ఇచ్చింది.
టీజర్లో స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుండటంతోపాటు అసలు ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని పెంచేలా టీజర్ కట్ చేశారు మేకర్స్. తెలుగు ఇండస్ట్రీ కన్నడపై చూపు తిప్పిందేంటి అనే వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే 1 నిమిషం 10 సెకన్ల నిడివి గల ఈ టీజర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చూపించారు. పవిత్ర లోకేష్(Pavithra lokesh), నరేష్(Naresh)ల పెయిర్ చూడటానికి స్క్రీన్‌పై అందంగా కనిపించారు.
ఈ 'మళ్లీ పెళ్లి' (Malli Pelli) చిత్రంలో జయసుధ, శరత్ బాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా సాగుతుంది. ఈ చిత్రాన్ని మేలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
