వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Nara Lokeshs Petition In Telangana High Court On Vyuham Movie
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ (Censor certificate) ను రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటీషన్ ఈ నెల 26న విచారణకు రానుంది. ఆర్జీవీ(RGV) ఇష్టమొచ్చినట్లు పాత్రలను సృష్టించారని లోకేష్ పిటీషన్ లో ఆరోపించారు. సినిమాలో చంద్రబాబు(Chandrababu)ను తప్పుగా చూపించారని.. ఆయనను అప్రతిష్ఠపాలు చేసేందుకే సినిమా తీశారని పేర్కొన్నారు. ట్రైలర్‌లో మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.
ఇదిలావుంటే.. నారా లోకేష్ వేసిన పిటిషన్‌పై ఆర్జీవీ స్పందించారు. తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్(Lakshmis NTR), వ్యూహం సినిమా( Vyuham Movie)లలో ఎవరనీ కించపరిచేవిధంగా తీయలేదని అన్నారు. ఆ సినిమాల్లో వారి పాత్రలు ఉండడం వల్లే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. అవసరమైతే టీడీపీ వారు కూడా సినిమాలు తీసుకోవచ్చని సూచించారు. తనకు సినిమా(Cinema), రాజకీయం(Politics) ఒక్కటేనని పేర్కొన్నారు. తనను ఢీ కొనాలంటే తన మాదిరే సినిమాతీయాలని హితవు పలికారు.
